చెన్నై ఫ్లాట్‌ఫాంపై అనుమానాస్పద పార్శిల్... తెరిచి చూస్తే...

By sivanagaprasad kodatiFirst Published Nov 18, 2018, 11:42 AM IST
Highlights

 చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫాంపై ఓ అనుమానాస్పద పార్శిల్  సంచలనం సృష్టించింది. స్టేషన్‌లోని 5వ నెంబర్ ఫ్లాట్ ఫాంపై పార్శిల్ ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు దానిని తెరిచిచూడగా... అందులో వెయ్యి కిలోల కుక్కు మాంసం లభించింది

 చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫాంపై ఓ అనుమానాస్పద పార్శిల్  సంచలనం సృష్టించింది. స్టేషన్‌లోని 5వ నెంబర్ ఫ్లాట్ ఫాంపై పార్శిల్ ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు దానిని తెరిచిచూడగా... అందులో వెయ్యి కిలోల కుక్కు మాంసం లభించింది.

రాజస్థాన్ నుంచి చెన్నైకి బయల్దేరిన జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో కుక్కు మాంసాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో.. వారు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి శనివారం ఎగ్మూర్ స్టేషన్‌కు చేరుకున్నారు.. 5వ నెంబర్ ఫ్లాట్‌ఫాంపై తనిఖీలు చేస్తుండగా.. అక్కడ ఒక అనుమానాస్పద పార్శీల్ కనిపించింది.

దానిని తెరిచి చూడగా 1000 కేజీల కుక్క మాంసం..ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. పార్శిల్‌పై ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.. గతంలో ఎగ్మూర్, సెంట్రల్ రైల్వే స్టేషన్‌లలో ఆరోగ్యశాఖ అధికారులు పలుమార్లు తనిఖీలు చేపట్టినప్పుడు నాణ్యత లేని మాంసం లభ్యమవ్వగా.. ఇప్పుడు ఏకంగా వెయ్యి కిలోల కుక్క మాంసం లభించడం కలకలం రేపుతోంది. 

click me!