Dog: కుక్క విశ్వాసం.. అడ్డు రావడంతో యాక్సిడెంట్.. మృతుడి తల్లి చేతిలో తల వాల్చి ఆ కుక్క విచారం

By Mahesh KFirst Published Nov 25, 2023, 9:54 PM IST
Highlights

కర్ణాటకలో 21 ఏళ్ల యువకుడు కుక్కను తప్పించబోయి ప్రమాదానికి గురై మరణించాడు. అప్పటి నుంచి కుక్క తీవ్ర విచారంలో మునిగిపోయింది. ఆ యువకుడి డెడ్ బాడీని వెంబడిస్తూ 8 కిలోమీటర్ల దూరంలోని ఇల్లు చేరుకుంది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత యువకుడి తల్లి వద్దకు విచారంగా వెళ్లి ఆమె చేతిలో తల వాల్చింది.
 

బెంగళూరు: మనిషికి విశ్వాసమైన స్నేహితుడు కుక్క. ఇది పాత సామెత. కానీ, ఇప్పటికీ మనుషుల పట్ల కుక్క చూపే విశ్వాసం, ప్రేమ ఈ మాటను నిజం చేస్తూ వస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలో అనూహ్య ఘటన జరిగింది. కుక్క కారణంగా జరిగిన యాక్సిడెంట్‌లో యువకుడు మరణించాడు. ఆ కుక్క వెంటనే డెడ్ బాడీతో వెళ్లుతున్న వాహనాన్ని వెంబడిస్తూ 8 కిలోమీటర్లు చేరుకుంది. అంత్యక్రియలు ముగిశాక యువకుడి తల్లి వద్దకు విచార వదనంతో వెళ్లింది. ఆమె చేతిలో తల వాల్చి బాధపడింది. నమ్మశక్యం కాని ఈ ఘటన కర్ణాటకలోని దేవనాగరిలో చోటుచేసుకుంది.

21 ఏళ్ల తిప్పేశ్ శివమొగ్గలోని భద్రావతి తాలూక వద్ద యాక్సిడెంట్‌కు గురయ్యాడు. బైక్ పై వెళ్లుతుండగా కుక్క అడ్డురావడంతో దాన్ని తప్పించబోయాడు. కానీ, ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్రమైన గాయాలతో మరణించాడు. ఈ ఘటన నవంబర్ 16వ తేదీన చోటుచేసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క మరణించిన యువకుడి ఇంటి ముందు కనిపించింది. తిప్పేశ్ తల్లి వద్దకు వచ్చింది. ఆమె చేతిలో తల వాల్చింది. ఆ కుక్క మరణించిన యువకుడికి సంతాపం ప్రకటిస్తున్నట్టుగా, విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్నదని ఆమె చెప్పింది.

Latest Videos

తిప్పేశ్ తల్లి యశోదమ్మ మాట్లాడుతూ.. ‘ఆ కుక్క నా కొడుకుకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇంటికి రావడానికి ప్రయత్నించింది. కానీ, వీధి కుక్కలు దానిపైకి ఉరిమాయి. చివరకు కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క మా ఇంటిలోకి వచ్చింది. నా దగ్గరికి వచ్చింది. నా చేతిలో ఆ కుక్క తల వాల్చింది. తిప్పేశ్ మరణం పట్ల ఆ కుక్క విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా ఆ క్షణాన నాకు అనిపించింది. ఇప్పుడు ఆ కుక్క మాతోనే ఉంటున్నది’ అని వివరించింది.

Also Read: rythu bandhu: బ్యాంకులకు వరుస సెలవులు.. రైతు బంధు డబ్బులు పడేది ఆ రోజే!

ఆ కుక్క సుమారు 8 కిలోమీటర్ల దూరం వచ్చి తమను చేరుకుందని తిప్పేశ్ బంధువు ఒకాయన చెప్పాడు. ‘తిప్పేశ్ డెడ్ బాడీని మోసుకెళ్లిన వాహనాన్ని ఆ కుక్క ఫాలో అయింది. ప్రమాద స్థలి నుంచి సుమారు 8 కిలోమీటర్ల ఆ కుక్క నేరుగా తమ ఇంటి దాకా వచ్చింది. మా ఇంటికి సమీపంలోనే తిప్పేశ్ అంత్యక్రియలు జరిగాయి. అప్పుడు కూడా ఆ చుట్టుపక్కలే కుక్క తచ్చాడింది. మూడు రోజుల తర్వాత ఆ కుక్క మా ఇంటిలోకి వచ్చింది. తిప్పేశ్ తల్లిని ఓదార్చుతున్నట్టుగా ఆమె వద్దకు వెళ్లింది’ అని చెప్పాడు. 

‘మాకు ఆ కుక్క మీద కోపమేమీ లేదు. అది ఒక ప్రమాదం. దురదృష్టవశాత్తు అందులో నా సోదరుడు చనిపోయాడు’ అని తిప్పేశ్ సోదరి చందన తెలిపింది.

click me!