ప్రధాని ఎంత చదివాడో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?: గుజరాత్ హైకోర్టు తీర్పుపై కేజ్రీవాల్

By Mahesh KFirst Published Mar 31, 2023, 6:37 PM IST
Highlights

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతలను వెల్లడించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ వివరాల కోసం దరఖాస్తు చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానా విధించింది. 
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి డిగ్రీ విద్యార్హత వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. అంతేకాదు, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానా కూడా విధించింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రూ. 25 వేల జరిమానా విధించాలన్న గుజరాత్ హైకోర్టు ఆదేశాలను ఆయన ఖండించారు. ప్రధానమంత్రి ఎంత చదివాడో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? అని ప్రశ్నించారు.

దేశ ప్రజలు వారి ప్రధాని ఎంత చదువుకున్నాడో తెలుసుకునే హక్కును కలిగిలేరా? అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రధాని ఆయన డిగ్రీని కోర్టులో చూపించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన డిగ్రీ చూపించాలని అడిగిన వారికి జరిమానా విధిస్తారా అని అడిగారు. అసలేం జరుగుతున్నది? అంటూ పేర్కొన్నారు. 

అంతేకదు, ఒక నిరక్షరాస్యుడైన లేదా తక్కువ చదివిన ప్రధానితో దేశానికి ప్రమాదం ఉంటుందని కేజ్రీవాల్ తెలిపారు.

Also Read: కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్.. పార్క్ నుంచి ఈడ్చుకెళ్లి దాష్టీకం.. నిందితులు అరెస్ట్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించాలని గుజరాత్ యూనివర్సిటీని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ 2016లో ఆదేశించింది. ఈ ఆదేశాలకు స్పందించి ప్రధాని మోడీ వివరాలను యూనివర్సిటీ వెల్లడించలేదు. సమాచార హక్కు చట్టం కింద సీఐసీ చేసిన ఆదేశాలను గుజరాత్ యూనివర్సిటీ గుజరాత్ హైకోర్టులో సవాల్ చేసింది. తాజాగా, సీఐసీ ఆదేశాలను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రధాని మోడీ విద్యార్హతలను వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేకాదు, ప్రధాని మోడీ డిగ్రీ వివరాలు వెల్లడించాలని పేర్కొంటూ దరఖాస్తు చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానాను విధించింది.

click me!