ఆడుకొంటూ విజిల్ మింగింది: 25 ఏళ్ల తర్వాత తొలగించారు

By narsimha lodeFirst Published Feb 18, 2021, 5:51 PM IST
Highlights

కేరళలోని కన్నూరు జిల్లాలో ఓ మహిళ గొంతు నుండి విజిల్ ను వైద్యులు బయటకు తీశారు. 


తిరువనంతపురం:కేరళలోని కన్నూరు జిల్లాలో ఓ మహిళ గొంతు నుండి విజిల్ ను వైద్యులు బయటకు తీశారు. గొంతు సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన మహిళ గొంతు నుండి వైద్యులు విజిల్ ను బయటకు తీశారు.

కన్నూరు జిల్లాలోని మట్టనూరుకు చెందిన మహిళకు గొంతు సమస్యతో స్థానికంగా ఉన్న వైద్య కాలేజీలో చికిత్స కోసం వెళ్లింది. వైద్యకాలేజీ నిపుణులు రాజీవ్ రామ్ పద్మనాభం ఆ మహిళను పరీక్షించారు.ఆమె శ్వాసనాళంలో ఒక వైపున విజిల్ ఉందని వైద్యులు గుర్తించారు. ఈ విజిల్ ను శ్వాసనాళం నుండి వైద్యులు బయటకు తీశారు. 

25 ఏళ్ల క్రితం ఆమె ఈ విజిల్ ను మింగినట్టుగా వైద్యులకు తెలిపింది.స్నేహితులతో ఆడుకొనే సమయంలో తాను విజిల్ ను పొరపాటున మింగినట్టుగా బాధితురాలు తెలిపింది.ఉబ్బసం కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులున్నాయని వైద్యులు భావించారు.  కానీ విజిల్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని వైద్యులు చెప్పారు.

విజిల్ ను శ్వాసనాళం నుండి బయటకు తీసిన తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. 
 

click me!