బీజేపీ ఏజెంట్లలా గవర్నర్లు.. వాళ్లను అంబేద్కర్ ప్రసంగాలు చదువుకోమనండి : లోక్‌సభలో కనిమొళి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 7, 2023, 4:00 PM IST
Highlights

గవర్నర్ల వ్యవస్థపై మండిపడ్డారు డీఎంకే ఎంపీ కనిమొళి. తెలంగాణ , కర్నాటక, నాగాలాండ్,తమిళనాడులలో గవర్నర్ల తీరు అభ్యంతరకరమన్నారు. అంబేద్కర్ ప్రసంగాలను చదువుకోమని గవర్నర్లకు చెప్పాలని ఆమె చురకలంటించారు.

కేంద్రంపై మండిపడ్డారు డీఎంకే ఎంపీ కనిమొళి. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హిందీ భాష తప్పించి దక్షిణాది భాషలంటే కొందరికి చిన్న చూపంటూ కనిమొళి తీవ్రవ్యాఖ్యలు చేశారు. విపక్షాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా బుల్డోజ్ చేసి బిల్స్ పాస్ చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రాలను చేంద్రం చిన్న చూపు చూస్తోందని కనిమొళి విమర్శలు గుప్పించారు. గవర్నర్లు వివక్ష చూపరాదని రాజ్యాంగంలో వుందని.. అంబేద్కర్ ప్రసంగాలను చదువుకోమని గవర్నర్లకు చెప్పాలని ఆమె చురకలంటించారు. గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని.. తెలంగాణ , కర్నాటక, నాగాలాండ్,తమిళనాడులలో గవర్నర్ల తీరు అభ్యంతరకరమని కనిమొళి విమర్శలు గుప్పించారు. 

ALso REad: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిప‌థ్, పేదరికం-అదానీ అంశాలను లేవనెత్తుతూ కేంద్రాన్ని నిల‌దీసిన రాహుల్ గాంధీ

అంతకుముందు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆరో రోజు రాష్ట్రప‌తి ప్ర‌సంగ‌ ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను ప్రస్తావిస్తూ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిప‌థ్ పథకం, పేదరికం, అదానీ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అగ్నివీర్ పథకం సైనిక ప్రణాళిక కాదని ఆర్మీ అధికారులు, మాజీ సైనికులు తనతో చెప్పారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. "అగ్నిప‌థ్ స్కీమ్ ను సైన్యంపై రుద్దారు. దీనిని అజిత్ దోవల్ విధించారు. ఇదీ ఆరెస్సెస్ ఆలోచన" అని రాహుల్ గాంధీ అన్నారు. తన ప్రసంగంలో రాహుల్ గాంధీ తన  ప్రసంగంలో భారత్ జోడో యాత్ర అనుభవాలను పంచుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు. యాత్రలో ప్రజల బాధలు, బాధలు తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. గిరిజనులు తమ భూమిని లాక్కుంటున్నారని కూడా చెప్పారు. 

అగ్నిప‌థ్ ను అంగీక‌రించ‌ని నిరుద్యోగ యువ‌త‌.. 

త‌న దేశ‌వ్యాప్త పర్యటనలో ప్రజలతో మాట్లాడే, వారి సమస్యలు వినే అవకాశం లభించిందని రాహుల్ గాంధీ తెలిపారు."ప్రస్తుతం మీరు (అధికార పార్టీ నేత‌లు) అగ్నిప‌థ్ పథకాన్ని ప్రశంసించారు, కానీ సైన్యంలో రిక్రూట్ మెంట్ కోసం తెల్లవారుజామున 4 గంటలకు వీధుల్లో తిరుగుతున్న నిరుద్యోగ యువత దీనికి అంగీకరించడం లేదన్నారు. నాలుగేళ్ల తర్వాత మమ్మల్ని సైన్యం నుంచి తరిమికొడతామని వారు చెబుతున్నారని" అన్నారు.

click me!