Disha Case Accused Encounter: దిశ ఘటనలో ప్రజలు కోరుకున్నదే జరిగింది: కేజ్రీవాల్

By Arun Kumar PFirst Published Dec 6, 2019, 2:38 PM IST
Highlights

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఇటీవల చోటుచేసుకున్న దిశా సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులు పోలీసుల ఎన్కౌంటర్ లో హతమవ్వడంపై డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.  

న్యూడిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి న్యాయ వ్యవస్ధలో సత్వర మార్పులు చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని డిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. దీని ద్వారా ఇప్పటికే న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన ప్రజల్లో తిరిగి దైర్యాన్ని పెంచాలన్నారు.  

తెలంగాణ వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యంత దారుణంగా హత్యాచారానికి పాల్పడిని నిందితులను  తెలంగాణ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేసి  చంపారు. దీనిపై డిల్లీ సీఎం స్పందిస్తూ న్యాయ వ్యవస్థలో వున్న లొసుగుల వల్లే మహిళలపై దాడులు, దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. 

read more  రేపిస్టులు పారిపోతుంటే...చూస్తూ ఉరుకోవాలా..? స్వాతి మలివాల్

ఈ హత్యాచారం ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి  వచ్చిందని అభిప్రాయపడ్డారు. అది ఉన్నావో ఘటన కానీ  హైదరాబాద్ దిశ ఘటన కానీ ఇలాంటి వాటిపై ప్రజలు చాలా ఆగ్రహంతో వున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ లో దిశా నిందితులపై ఎన్కౌంటర్ జరగడం... దారుణానికి పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారో అలాగే జరగడం ప్రజల్లో ఆనందాన్ని నింపిందని కేజ్రీవాల్ అన్నారు. 

తెలంగాణ వెటర్నరీ వైద్యురాలు దిశను గత నెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

read more దిశ నిందితులు ఎన్ కౌంటర్: బహుత్ డేర్ అయా..దురస్త్ అయే అంటూ జయాబచ్చన్ కీలక వ్యాఖ్యలు

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 

click me!