ఫడ్నవీస్, అజిత్ ముచ్చట్లు : రాజకీయాలు కాకుండా.. వాతావరణం గురించి చర్చించారట

By Siva KodatiFirst Published Dec 10, 2019, 3:09 PM IST
Highlights

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముచ్చట్లు పెట్టడం మహా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముచ్చట్లు పెట్టడం మహా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు వీరిద్దరూ మరోసారి వ్యూహాలు రచిస్తున్నారా అన్న కోణంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. అయితే దీనికి చెక్ పెడుతూ.. అజిత్ అసలు ఏమైందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. 

Also Read:బల పరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ సర్కార్... బీజేపీ వాక్ అవుట్

సోమవారం స్వతంత్ర ఎమ్మెల్యే సంజయ్ షిండే కుమార్తె వివాహం సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇద్దరు పక్కపక్కన కూర్చొని చర్చించుకున్నారు.

దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగడంతో అజిత్ వివరణ ఇచ్చారు. కేవలం రాష్ట్రంలోని వాతావరణం, వర్షపాతం గురించే మాట్లాడున్నామని, తమ మధ్య ఎలాంటి రాజకీయ విషయాలు ప్రస్తావనకు రాలేదని అజిత్ స్ఫష్టం చేశారు. 

పెళ్లి నిర్వాహకులు చేసిన ఏర్పాట్ల వల్ల తాము పక్కపక్కన కూర్చొన్నాం తప్పించి కావాలని కాదని పవార్ వెల్లడించారు. దానితో పాటు రాజకీయాల్లో శాశ్వత శత్రువులెవరు ఉండరు కదా అని సమాధానమిచ్చారు.

Also Read:సీఎంగా ఉద్థవ్ థాక్రే బాధ్యతలు: తర్వాతి రోజే ఫడ్నవీస్‌కు కోర్టు సమన్లు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన సిద్ధమైన వేళ శరద్ పవార్ అన్న కుమారుడైన అజిత్ పవార్ రెబల్‌గా మారి బీజేపీకి మద్ధతు పలికారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా.. అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శరద్ పవార్ రాజకీయ చతురతతో అజిత్ తిరిగి సొంతగూటికి చేరడంతో బీజేపీ సర్కార్ కేవలం మూడు రోజుల్లోనే కుప్పకూలింది. 

click me!