Nirbhaya case : దోషులు తీహార్ జైలుకు,త్వరలోనే ఉరి?

By narsimha lodeFirst Published Dec 10, 2019, 2:27 PM IST
Highlights

నిర్భయ కేసు దోషులను తీహార్ జైలుకు తరలించారు పోలీసులు 

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు నిందితులను తీహార్ జైలుకు తరలించారు. దోషులను త్వరలోనే ఉరి తీస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో  వారిని తీహార్ జైలుకు తరలించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ కేసులో  దోషిగా ఉన్న వినయ్‌ మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్ ఇటీవలనే తిరస్కరించారు. ఈ ఘటనతో నిందితులకు ఉరి తీసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

మెర్సీ పిటిషన్ రద్దు చేసిన 14 రోజుల తర్వాత  నిందితులను ఉరి తీయాలనేది నిబంధన. ఈ కేసులో వినయ్ మినహా తర్వాత ముగ్గురు నిందితులను ఉరితీయాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి. అయితే వినయ్‌కు మాత్రం మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

Also read:ఆ జైలులో ఉరి తాళ్ల తయారి: నిర్భయ నిందితుల కోసమేనా

ఈ కేసులో దోషులు ఎవరూ కూడ క్షమాబిక్ష కోసం ఎవరూ కూడ మెర్సీ పిటిషన్ దాఖలు చేయలేదు. మెర్సీ పిటిషన్‌పై  తిరస్కరణకు గురైన 14 రోజుల తర్వాత ఉరి తీయాలి. ఈ కేసులో నిందితుడుగా ఉన్న అక్షయ్ ఠాకూర్  సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.గతంలో ఇదే కేసు విషయమై వినయ్ కుమార్, ముఖేష్ సింగ్, పవన్ గుప్తాలు  రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు.. ఈ పిటిషన్లను గతంలో రివ్యూ పిటిషన్లను కొట్టేశారు.  

అక్షయ్ కుమార్ ఠాకూర్ సుప్రీంకోర్టులో  ఈ నెల 8వ తేదీన రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.నిర్భయపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఆరుగురు నిందితులకు 2012 డిసెంబర్ 16వ తేదీన దోషులుగా తేల్చారు. 
 

click me!