చేయి కోసుకున్న వ్యక్తి: సుప్రీంకోర్టు వద్ద కలకలం

Siva Kodati |  
Published : Apr 12, 2019, 01:58 PM IST
చేయి కోసుకున్న వ్యక్తి: సుప్రీంకోర్టు వద్ద కలకలం

సారాంశం

దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఓ వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ కలకలం రేగింది.

దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఓ వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ కలకలం రేగింది. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు సాగుతుండగా ఓ వ్యక్తి లోపలికి వచ్చాడు.

అక్కడ న్యాయవాదులు, కక్షిదారులు ఉండగానే ఎడమచేతిని కోసుకున్నాడు. దీంతో అక్కడున్న  సిబ్బంది అతడిని రక్షించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతని చేతికి రుమాలు చుట్టి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?