సినిమా చూసిందని.. భార్యను హత్య చేసిన భర్త

Published : Apr 12, 2019, 11:02 AM IST
సినిమా చూసిందని.. భార్యను హత్య చేసిన భర్త

సారాంశం

రాత్రంతా సినిమాలు చూస్తూ కూర్చుందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

రాత్రంతా సినిమాలు చూస్తూ కూర్చుందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ముంబయికి చెందిన చేతన్ చౌగేల్(32) అనే వ్యక్తికి వివాహమై.. రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. గత కొంతకాలంగా అతని భార్య యూట్యూబ్ కి బాగా అడిక్ట్ అయిపోయింది. రోజూ యూట్యూబ్ లో సినిమాలు, వీడియోలు చూస్తోంది. దీనిపై భార్యను  చేతన్ పలు మార్లు హెచ్చరించాడు. అయితే.. ఆమెలో ఎలాంటి మార్పు రాకపోగా.. రాత్రి సమయంలో నిద్ర కూడా పోకుండా సినిమాలు చూస్తూ కుర్చుంటోంది.

కాగా.. ఆమె తీరుకి చేతన్ బాగా విసిగిపోయాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దంపతుల మధ్య ఘర్షణ చెలరేగింది. సౌండ్‌ ఎక్కువగా వస్తున్న కారణంగా తనకు, బిడ్డకు నిద్ర పట్టడం లేదని చేతన్‌ భార్యకు చెప్పినప్పటికీ ఆమె అతడి మాటలు పట్టించుకోలేదు. తెల్లవారి నాలుగు గంటల వరకు సినిమాలు చూస్తూనే ఉండటంతో కోపోద్రిక్తుడైన చేతన్‌ నైలాన్‌ తాడుతో ఉరి బిగించి, ఆమె గొంతు నులిమాడు. ఈ తర్వాత వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలనుకోగా అప్పటికే ఆమె మృతి చెందింది.

కాగా భార్య ప్రవర్తనతో విసిగిపోయి... క్షణికావేశంలోఆమెను హత్య చేశానని చేతన్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works