హిందుత్వం, బజరంగ్ దళ్‌పై దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Published : May 15, 2023, 10:50 PM IST
హిందుత్వం, బజరంగ్ దళ్‌పై దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

హిందుత్వం అనేది ధర్మం కాదని, ఆ పేరుతో దాడులకు పాల్పడటాన్ని తాము అంగీకరించమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్  అన్నారు. విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజ్‌రంగ్ దళ్‌ను 'గూండాల గ్రూపు'గా అభివర్ణించారు.

Digvijaya Singh: హిందుత్వం (Hindutva) అనేది మతం కాదని, అందరికీ సామరస్యాన్ని, సంక్షేమాన్ని బోధించే సనాతన ధర్మాన్ని తాను విశ్వసిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజ్‌రంగ్ దళ్‌ను 'గూండాల గ్రూపు'గా అభివర్ణించారు. హిందూతత్వం పేరిట చేసే దాడులను తాము అంగీకరించబోమని అన్నారు. 
 
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ..  “ మాది సనాతన ధర్మం. మేము హిందూ మతాన్ని ఒక మతంగా పరిగణించం, ధరమ్ కీ జై హో(ధర్మ విజయం), అధర్మ్ కా నాష్ హో (అధర్మ వినాశనం), ప్రాణియోం మే సద్భావన్ హో (జీవరాశుల మధ్య సామరస్యం), విశ్వ కా కల్యాణ్ హో (లోక కల్యాణం)' వంటి నినాదాలు సనాతన ధర్మ సభలకు ప్రతీకలు. ఇది సనాతన ధర్మమని అన్నారు. కానీ, హిందుత్వ విషయంలో అలా కాదని, హిందుత్వ అంటే... తమతో ఏకీభవించని వారిని కర్రలతో కొట్టడం, ఇళ్లు కూల్చవేయడం, డబ్బు దోచుకోవడమని  ఆరోపించారు.  

ప్రధాని నరేంద్ర మోదీని బజరంగ్ దళ్‌ను బజరంగ్‌ బలి (హనుమంతుడు)తో పోల్చడం బాధాకరమని దిగ్విజయ్ అన్నారు. జబల్‌పూర్‌లోని కాంగ్రెస్ కమిటీ కార్యాలయం (మే 4న) ధ్వంసం చేసేందుకు గూండాల ముఠా దాడి చేసిందని ఆయన ఆరోపించారు. బజరంగ్ దళ్ ను బజరంగ్ బాలితో పోల్చడం దేవతను అవమానించినట్లేనని అన్నారు. వారు క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగం, నియమాలు , చట్టాలను అనుసరిస్తుందని మాజీ ఎంపీ ముఖ్యమంత్రి అన్నారు.

కర్నాటకలో బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. "విద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ప్రకటనలు ఇచ్చే వారిపై మతంతో సంబంధం లేకుండా కేసుల నమోదుకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందని అన్నారు . కులం, మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసే భజరంగ్ దళ్,పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలపై కఠిన, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి పార్టీ కట్టుబడి ఉందని, అదే విషయాన్ని ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది. మే 10న జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ బజరంగ్ బాలిని పిలిచారు. మే 13న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వెలువడిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..