డిజిట‌ల్ టెక్నాల‌జీ దేశంలో న‌లుమూల‌ల‌కు విస్త‌రించింది.. : ఐటీయూ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభంలో ప్రధాని మోడీ

New Delhi: భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 2014 లో 25 కోట్ల నుండి 85 కోట్లకు పెరిగారనీ, పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ భారతదేశంలో ఎక్కువ వినియోగదారులు ఉన్నారని ప్రధాని న‌రేంద్ర మోడీ అన్నారు.
 

Digital technology has spread to all corners of the country; PM Modi inaugurates ITU Area Office and Innovation Centre

PM Modi inaugurated ITU Area Office and Innovation Centre: డిజిటల్ టెక్నాలజీ నేడు భారతదేశంలో విశ్వవ్యాప్తమైందనీ, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కొత్త అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా  ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. భారత్ 6జీ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన ప్రధాని.. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 2014 లో 25 కోట్ల నుండి 85 కోట్లకు పెరిగారనీ, పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ భారతదేశానికి ఎక్కువ వినియోగదారులు ఉన్నారని అన్నారు.

 

PM Narendra Modi inaugurates International Telecommunication Union (ITU) Area Office and Innovation Centre

— Press Trust of India (@PTI_News)

Latest Videos

ఐక్యరాజ్యసమితి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) ప్రత్యేక సంస్థ అయిన ఐటీయూ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. అనేక ప్రాంతాల్లో క్షేత్ర, ప్రాంతీయ కార్యాల‌యాల‌తో విస్తారమైన నెట్ వ‌ర్క్ ను ఇది కలిగి ఉంది. కాగా, 6జీ ఆర్ అండ్ డీ టెస్ట్ బెడ్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం ప్ర‌యివేటు రంగంతో కలిసి 25 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ ను వేసిందన్నారు. జామ్ (జన్ ధన్, ఆధార్ & మొబైల్) గురించి ప్రస్తావిస్తూ, త్రిమూర్తుల బలం ప్రపంచానికి ఒక కేస్ స్టడీ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

న్యూఢిల్లీలోని మెహ్రౌలిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఏరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి 2022 మార్చిలో ఐటీయూతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త కార్యాలయం భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లకు సేవలందిస్తుందని, దేశాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం-ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని ఒక ప్రకటనలో తెలిపింది.

 

Speaking at inauguration of ITU Area Office & Innovation Centre in Delhi. Initiatives like 6G Test Bed & 'Call Before You Dig' app are also being launched. https://t.co/z6hRdeTPbB

— Narendra Modi (@narendramodi)

 


 

vuukle one pixel image
click me!