తల్లిని కాటేసిన పాము.. నోటితో విషాన్ని తీసేసి కాపాడిన కూతురు.. అసలేం జరిగిందంటే..

By Sumanth KanukulaFirst Published Mar 22, 2023, 2:25 PM IST
Highlights

కర్ణాటకలో ఓ కాలేజ్ విద్యార్థిని ప్రదర్శించిన ధైర్యం తన తల్లి ప్రాణాలను నిలబెట్టింది. సాహసోపేతంగా సమయానుకూలమైన చర్య చేపట్టిన ఆ విద్యార్థిని నాగుపాము కాటుకు గురైన తన తల్లి జీవితాన్ని కాపాడింది.

కర్ణాటకలో ఓ కాలేజ్ విద్యార్థిని ప్రదర్శించిన ధైర్యం తన తల్లి ప్రాణాలను నిలబెట్టింది. సాహసోపేతంగా సమయానుకూలమైన చర్య చేపట్టిన ఆ విద్యార్థిని నాగుపాము కాటుకు గురైన తన తల్లి జీవితాన్ని కాపాడింది. పాము కాటు వేసిన చోటు నుంచి విషాన్ని పీల్చివేయడం ద్వారా ఇది సాధ్యమైంది. వివరాలు.. విద్యార్థిని శ్రామ్యా రాయ్ త్తూరులోని వివేకానంద డిగ్రీ కళాశాలలో చదువుతుంది. ఆమె తల్లి మమతా రాయ్ కెయ్యూరు గ్రామ పంచాయితీ సభ్యురాలుగా ఉన్నారు. మమత సమీపంలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. అక్కడ నీటి పంపును ఆన్ చేయడానికి వ్యవసాయ భూమికి వెళ్లింది. 

అయితే మమత తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఓ పాము ఆమె కాలుపై కాటేసింది. అప్రమత్తమైన మమత వెంటనే శరీరంలో విషం పైకి వ్యాపించకుండా ఉండేందుకు పాటు కాటు గుర్తు పై భాగంలో ఎండు గడ్డితో ముడి వేసింది. అయితే విషం శరీరంలోని ఇతర కీలక భాగాలకు వ్యాపించకుండా ఉండటానికి ఎండు గడ్డి ముడి అంతగా పనికి రాదని శ్రామ్యా గ్రహిచింది. తన తల్లి ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకుంది. వెంటనే తన నోటితో పాటు కాటు వేసిన చోటు నుంచి విషాన్ని పీల్చి తీసేసింది.

శ్రామ్య సకాలంలో తీసుకున్న చర్య వల్లే మమత ప్రాణాలతో ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రామ్య చూపిన సమయస్ఫూర్తి కారణంగా మమత నాగుపాము కాటుతో ఎటువంటి చెడు ప్రభావాలు లేకుండా బయటపడింది. ఇక, మమతను ఒకరోజు ఆసుపత్రిలో ఉంచి.. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు.

శ్రామ్య మాట్లాడుతూ.. “పాము కాటు గురించి మా అమ్మ నాకు తెలియజేసింది. పాటు కాటు వేసిన చోట పైభాగంలో ఎండు గడ్డిని కట్టినా.. ఆ విషం శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించదని నాకు నమ్మకం లేదు. కాబట్టి నేను నా నోటి ద్వారా విషాన్ని పీల్చివేశాను. విషం పీల్చివేయడం వల్ల మంచి జరిగిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇది నా మొదటి అనుభవం. ఈ ప్రథమ చికిత్స టెక్నిక్ గురించి నేను విన్నాను. కొన్ని సినిమాలో కూడా అది చూశాను. అందుకే నేను ధైర్యంగా ఈ పని చేశారు’’ అని చెప్పారు. ఇక, శ్రామ్య.. స్కౌట్స్ అండ్ గైడ్స్ రేంజర్ కూడా. 

click me!