Digital currency: డిజిటల్‌ కరెన్సీ వచ్చేస్తోంది..!

Published : Feb 02, 2022, 02:05 PM IST
Digital currency: డిజిటల్‌ కరెన్సీ వచ్చేస్తోంది..!

సారాంశం

Digital currency: డిజిటల్ ఇండియాలో భాగంగా  డిజిట‌ల్ ఎకానమీకి ఊతం ఇవ్వ‌డానికి డిజిటల్‌ కరెన్సీని ప్ర‌వేశ‌పెట్ట‌బోతుంది మోడీ స‌ర్కార్. సమర్థమంతమైన కరెన్సీ నిర్వహణకు తోడ్పడేలా రిజర్వ్‌ బ్యాంక్ నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. ఏప్రిల్‌తో మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిటల్‌ కరెన్సీ అందుబాటులోకి తీసుకరానున్న‌ది.   

Digital currency: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగ‌ళ‌వారం లోక్ సభలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఈ బ‌డ్జెట్ లో కేంద్రం డిజిట‌ల్ క‌రెన్సీ పై మంత్రం వేసింది.  ప్రస్తుత ఏడాదిలోనే డిజిటల్‌ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు బడ్జెట్‌లో కేంద్రం వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 

ఇంత‌కీ డిజిట‌ల్ క‌రెన్సీ అంటేమిటీ?  
 
భార‌త్  క్రిప్టో క‌రెన్సీని ఆమోదిస్తోందా? అస‌లు డిజిటల్ క‌రెన్సీని అంగీక‌రిస్తోందా? ప‌లు అనుమానాల మ‌ధ్య  కేంద్రం ప‌రోక్షంగా ఆమోదం కేంద్రం తెలిపింది. కేంద్ర బ‌డ్జెట్లో క్రిప్టో క‌రెన్సీ లాభాదేవీల‌పై 30 ప‌న్ను విధిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ డిజిట‌ల్ క‌రెన్సీ బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూపకల్పన చేయ‌నున్న‌ది కేంద్రం.  డిజిటల్ కరెన్సీని సీబీడీసీగా పిలుస్తారు. సీబీడీసీ అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. డిజిటల్ కరెన్సీ రాకతో ఇప్పటివరకు నగదు వినియోగంపై ఆధారపడిన ప్రస్తుత వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది.

ఈ డిజిట‌ల్ క‌రెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థ బూస్టర్‌లాగా పనిచేస్తుందని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ఈ క‌రెన్సీ ద్వారా డిజిటల్‌ బ్యాంకింగ్‌ మరింత అభివద్ధి చెందుతుంది. బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతతో రిజర్వ్‌ బ్యాంక్ ఈ క‌రెన్సీపై నియంత్ర‌ణ క‌లిగి ఉంటుంది. ఈ క‌రెన్సీని ఎంత పరిమాణంలో  జారీ చేయాలో ఆర్‌బిఐ నిర్ణ‌యం మీద ఆధారప‌డి ఉంటుంది.  కాగితపు రహిత కరెన్సీ అయినప్పటికీ దీనిపై ఆర్‌బిఐ పర్యవేక్షణ ఉంటుంది. 

డిజిటల్స్ క‌రెన్సీ ప్ర‌యోజ‌నాలు.. ప్రాథమికంగా న‌గ‌దు  చెల్లింపులను మరింత సుల‌భ‌త‌రం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతోంది.  నగదు వినియోగాన్ని తగ్గిపోతుంది.  అన్ లైన్ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సానుకూల మార్పులకు దోహ‌దం చేస్తుంది.   రియల్‌ టైమ్‌లో, వేగవంతంగా  ప్ర‌పంచ‌వ్యాప్తంగా రెమిటెన్సులకు కూడా తోడ్పడగలదు. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలకు లావాదేవీల వ్యయాలు కూడా తగ్గగల‌వు.  

డిజిట‌ల్ క‌రెన్సీ ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌ల్ల‌.. ఆన్ లైన్  చెల్లింపులు పెరుగుతాయి. దీనితోపాటు బిట్‌కాయిన్‌ వంటి  క్రిప్టో కరెన్సీలకు డిమాండ్‌ పెరుగుతోంది. మ‌రెన్నో ప్ర‌వేట్ వర్చువల్‌ కరెన్సీలు పుట్టుకొస్తాయి.  సాధారణ లావాదేవీల వ్యయాలతో పోలిస్తే ఈ తరహా కరెన్సీలతో జరిపే లావాదేవీల వ్యయాలు తక్కువ. దీంతో చాలా మంది డిజిట‌ల్ క‌రెన్సీ వైపు మొగ్గు చూపుతారు. కొందరు దీన్ని ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా మదుపు చేస్తున్నారు.

అయితే, ఈ తరహా అనధికారిక కరెన్సీల విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పైగా వీటికి చట్టబద్ధత లేకపోవడం మరో ప్రతికూలాంశం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం చూపుతాయన్న కారణంతో ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్‌ బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం