
Independence Day 2025: ఆగస్టు 15 అనగానే స్వాతంత్య్ర దినోత్సవం అని ఎవరైనా చెప్పేస్తారు. 1947, ఆగస్టు 15వ తేదీన బ్రిటీష్ పాలకుల నుండి భారతదేశానికి విముక్తి లభించిందనే రోజు అని అందరికీ తెలిసిందే. ఇందుకే ప్రతి సంవత్సరం ఆగస్ఠు 15వ తేదీన దేశమంతా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. అయితే ఆగస్టు 15కేవలం భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన రోజు మాత్రమే కాదు ఇదే తేదీన ఇంకా నాలుగు దేశాలు కూడా తమ బానిస సంకెళ్లను తెంచుకుని స్వాతంత్రం పొందిన రోజు. ఈ దేశాలు భారతదేశం లాగే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం…
ఉత్తర కొరియా – దక్షిణ కొరియా ( North Korea, South Korea)
1945, ఆగస్టు 15న జపాన్ ఆక్రమణ నుండి విముక్తి పొందిన కొరియా దేశం తర్వాత ఉత్తర, దక్షిణ కొరియాగా విడిపోయింది. ఈ రోజును వారు "నేషనల్ లిబరేషన్ డే"గా జరుపుకుంటారు. ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు జపాన్ బానిసత్వంలో ఏళ్ళకేళ్ళుగా మగ్గిపోయాయి. స్వాతంత్య్రం కోసం అలుపులేని పోరాటాలు చేశాయి. ఫలితంగా 1945, ఆగస్టు 15న జపాన్ నుండి విముక్తి లభించింది. కొరియా భారత్ కన్నా మూడేళ్ల ముందే స్వేచ్ఛను పొందింది. 1945లో స్వాతంత్య్రం లభించినా 1948లో ఈ కొరియా దేశం ఉత్తర, దక్షిణ కొరియాగా విభజించబడింది.
బహ్రెయిన్..( Bahrain)
భారత్ లాగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు జరుపుకునే మరొక దేశం బహ్రెయిన్. ఇది 1971లో బ్రిటీష్ పాలకుల బానిసత్వం నుండి విముక్తి చెంది స్వాతంత్య్రాన్ని సాధించుకుంది. బహ్రెయిన్‌తో పాటు అరేబియా ప్రాంతం, పలు ద్వీపాలు బ్రిటీష్ ఆధీనంలో ఉండేవి. దీర్ఘకాల పోరాటం తర్వాత అక్కడ బ్రిటిష్ ప్రభావం తగ్గి స్వతంత్ర పాలన ప్రారంభమైంది. ఇలా భారత్ లాగా ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందిన దేశాల్లో బహ్రెయిన్ కూడా ఒకటి.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో..(Democratic Republic of the Congo)
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో 1960, ఆగస్టు 15న ఫ్రాన్స్ పాలన నుండి స్వాతంత్య్రం పొందింది. అప్పటిదాకా ఇది "ఫ్రెంచ్ కాంగో"గా పిలవబడింది. స్వాతంత్య్రానంతరం "డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో"గా రూపాంతరం చెందింది.
లిచెన్ స్టెయిన్..(Liechtenstein)
లిచ్టెన్‌స్టెయిన్ ప్రపంచంలో ఆరవ అతిచిన్న దేశం. స్వాతంత్య్రానికి ముందు ఇది జర్మన్ అధిపత్యంలో ఉండేది. 1940, ఆగస్టు 15న ఈ దేశం స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. భారతదేశం కంటే చాలా చిన్నదైనప్పటికీ, భారత్ కంటే ముందే లిచ్టెన్‌స్టెయిన్ స్వేచ్ఛను సంపాదించింది. అప్పటి నుంచీ ఆగస్టు 15ను జాతీయ దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది.