New Delhi: విపక్షాల సమావేశం తర్వాత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దుచేసిన అంశంపై కాంగ్రెస్ పార్టీ తమ నిరసనను మరింత ఉధృతం చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయాలని కాంగ్రెస్ నేతలు పార్టీ సమావేశంలో నిర్ణయించారు.
Congress To Intensify Protest: ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో జరిగిన భారీ వ్యూహ సమావేశంలో పాల్గొంది. ఇది ప్రతిపక్షాల ఐక్యత అంశంలో కీలకంగా మారింది. ఇదే సమయంలో ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయాలని కాంగ్రెస్ నేతలు పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రస్తావించడంతో పాటు రాహుల్ గాంధీ పై అనర్హత వేటును ప్రస్తావిస్తూ పెద్దఎత్తున ఆందోళనలు చేయనుంది కాంగ్రెస్. అలాగే, ఆయా అంశాల గురించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
దీనికి సంబంధించి టాప్-10 పాయింట్లు ఇలా ఉన్నాయి..
సోమవారం సాయంత్రం జరిగిన వ్యూహాత్మక సమావేశంలో కాంగ్రెస్ సహా 17 పార్టీల ప్రతినిధులు పలు సున్నితమైన అంశాలపై ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానించకుండా ఉండనున్నారు.
2005 నుంచి రాహుల్ గాంధీ నివాసం ఉంటున్న తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు జారీ అయ్యాయి.
నేడు, రేపు 35 నగరాల్లో 'డెమోక్రసీ డిస్ క్వాలిఫైడ్' అనే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
భారత న్యాయస్థానాల్లో రాహుల్ గాంధీ కేసును తాము పర్యవేక్షిస్తున్నామనీ, భావ ప్రకటనా స్వేచ్ఛతో సహా ప్రజాస్వామ్య విలువలకు ఉమ్మడి నిబద్ధతపై భారత ప్రభుత్వంతో అమెరికా సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. 'ఈ రోజు నల్లని దుస్తుల్లో పార్లమెంటుకు వచ్చాం. ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దేశానికి చూపించాలనుకుంటున్నాం' అని ఖర్గే అన్నారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై సభలో గందరగోళం సృష్టించి, నిరసనలు వ్యక్తం చేసినందుకు 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మార్చి 29 వరకు మిగిలిన బడ్జెట్ సమావేశాలకు గుజరాత్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీహార్, ఒడిశా, గుజరాత్, పుదుచ్చేరి, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.
'మోడీ' ఇంటిపేరు ఉన్నవారు దొంగలేనా అని అడిగినందుకు గుజరాత్ లో ఓ బీజేపీ నేత దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.