హైదరాబాద్ కు చెందిన క్యాన్సర్ మెడిసిన్ లో ప్రాణాంతక బ్యాక్టీరియా.. గుర్తించిన లెబనాన్, యెమెన్ వైద్యాధికారులు

By Asianet NewsFirst Published Mar 28, 2023, 10:18 AM IST
Highlights

హైదరాబాద్ కు చెందిన సంస్థ తయారు చేసిన క్యాన్సర్ డ్రగ్‌లోని ఓ బ్యాచ్ లో ప్రాణాంతక బ్యాక్టీరియా ఉన్నట్టు లెబనాన్, యెమెన్ వైద్యాధికారులు గుర్తించారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లోక్ సభకు తెలిపింది. 

హైదరాబాద్ లోని సెలోన్ ల్యాబ్స్ తయారు చేసిన క్యాన్సర్ మెడిసిన్ లో సూడోమోనాస్ ప్రాణాంతక బ్యాక్టీరియా ఉన్నట్లు లెబనాన్, యెమెన్ వైద్యాధికారులు గుర్తించారు. సెలోన్ ల్యాబ్ మెథోట్రెక్సేట్, ఇంజెక్షన్ కెమోథెరపీ ఏజెంట్, రోగనిరోధక వ్యవస్థ అణచివేతతో పాటు నాలుగు నాసిరకం, కలుషితమైన ఉత్పత్తుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిక జారీ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లోక్ సభకు తెలిపింది. సెలోన్ కు చెందిన మెథోట్రెక్సేట్ 50 ఎంజీ వయల్స్ పై ఈ హెచ్చరిక జారీ చేసిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.

సూర్య నమస్కారం చేస్తున్న చిరుతపులి.. వైరల్ గా మారిన వీడియో..

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. యెమెన్, లెబనాన్ ఆరోగ్య అధికారులు ఈ మెడిసిన్ పై పరీక్షలు నిర్వహించగా పిల్లల్లో ప్రతికూల ప్రభావాలను గమనించారు. అది కలుషితమైనట్లు కనుగొన్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ‘‘మెథోట్రెక్సేట్ చికిత్స పొందుతున్న రోగులు బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉండే అవకాశం ఉంది. వీరు అంటువ్యాధులకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది’’ అని హెచ్చరించింది.

కంటి సమస్యలను కనిపెట్టే సింగిల్ యాప్... 11ఏళ్ల బాలిక సృష్టి..!

అనధికారిక మార్కెట్ల ద్వారా ఈ ఔషధం రెండు దేశాలకు చేరి ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. ఎంటీఐ2101బీఏక్యూ బ్యాచ్ ను భారత్ లో మాత్రమే విక్రయించాల్సి ఉండగా, రెండు పశ్చిమాసియా దేశాలు రెగ్యులేటెడ్ సప్లయ్ చైన్ కు వెలుపల కొనుగోలు చేశాయని పేర్కొంది. ఈ మార్కెట్లకు ఉత్పత్తి భద్రతకు తయారీదారు హామీ ఇవ్వలేకపోయాడని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అనధికారిక మార్కెట్ల ద్వారా ఇతర దేశాలకు కూడా ఈ ఔషధాన్ని పంపిణీ చేసి ఉంటారని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 

ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడండి: రాష్ట్రపతికి మమతా బెనర్జీ విజ్ఞప్తి

అందువల్ల రోగులకు హాని జరగకుండా చూడాలంటే ఈ కలుషితమైన ఉత్పత్తిని గుర్తించి, మార్కెట్ నుంచి దీనిని సర్క్యులేషన్ నుంచి తొలగించడం చాలా ముఖ్యమని తెలిపింది. కాగా.. సెలోన్ ల్యాబ్ కు కాజ్ నోటీసులు జారీ చేశామని, ఈ మెడిసిన్ ఉత్పత్తిని నిలిపివేయాలని చెప్పామని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ జి.రామ్ దన్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తో తెలిపారు. 
 

click me!