జర్నలిస్ట్ హత్య: డేరాబాబా‌తో పాటు మరో ముగ్గురు దోషులు

By narsimha lodeFirst Published Jan 11, 2019, 4:09 PM IST
Highlights

జర్నలిస్ట్ హత్య కేసులో  పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టులో డేరా బాబాకు ఎదురు దెబ్బ తగిలింది. రామ్ చందర్ ఛత్రపతి అనే జర్నలిస్ట్‌ను హత్య చేసిన కేసులో రామ్ రహీమ్( డేరాబాబా)ను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.


న్యూఢిల్లీ: జర్నలిస్ట్ హత్య కేసులో  పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టులో డేరా బాబాకు ఎదురు దెబ్బ తగిలింది. రామ్ చందర్ ఛత్రపతి అనే జర్నలిస్ట్‌ను హత్య చేసిన కేసులో రామ్ రహీమ్( డేరాబాబా)ను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.

2002లో డేరా బాబాతో పాటు ఆయన ముగ్గురు అనుచరులైన కిషన్ లాల్, నిర్మల్ సింగ్, కుల్దీప్ సింగ్‌లు   జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతిని  చంపేశారు.  ఈ కేసులో డేరాబాబాను దోషిగా కోర్టు తేల్చింది.

ఇప్పటికే డేరాబాబా 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆశ్రమంలో  ఉన్న సాధ్వీలతో పాటు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారనే  ఆరోపణలపై డేరాబాబా శిక్షను అనుభవిస్తున్నారు.

ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు గాను జర్నలిస్ట్ రామ్ చందర్‌ను డేరా బాబా హత్య చేయించారని  ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన కోర్టు ఈ కేసులో డేరాబాబాను దోషిగా తేల్చింది.

అయితే డేరా బాబాకు ఈ నెల 17వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. డేరా బాబాకు కేసు తీర్పు ఉన్నందున పంచకుల కోర్టు పరిసర ప్రాంతాల్లో  పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. గతంలో కూడ డేరాబాబాకు  శిక్ష విధించిన సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే.

click me!