యోగా, ప్రాణాయామంతో కరోనాను ఎదుర్కొన్నా: వైరల్‌గా మారిన ఢిల్లీ వాసి వీడియో

By narsimha lode  |  First Published Apr 23, 2020, 2:21 PM IST

ఢిల్లీలోని తొలి కరోనా బాధితుడు 45 ఏళ్ల వ్యాపారి రోహిత్ దత్తా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన ఓ వీడియోను  పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాణాయామం ద్వారానే తాను కరోనా నుండి కోలుకొన్నట్టుగా రోహిత్ దత్తా తెలిపారు.
 


న్యూఢిల్లీ: ఢిల్లీలోని తొలి కరోనా బాధితుడు 45 ఏళ్ల వ్యాపారి రోహిత్ దత్తా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన ఓ వీడియోను  పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాణాయామం ద్వారానే తాను కరోనా నుండి కోలుకొన్నట్టుగా రోహిత్ దత్తా తెలిపారు.

ఆసుపత్రిలో ఉన్న 14 రోజుల పాటు క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేసినట్టుగా ఆయన వివరించారు. ఈ రెండు కూడ తనను కరోనాను బయటపడేసినట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. యోగా, ప్రాణాయామాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఆయన సూచించారు.

Latest Videos

also read:వీడియో కాన్పరెన్స్ ద్వారా దేశంలో మొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం

యోగా, ప్రాణాయామం, మానసిక స్థైర్యంతో కరోనాను ఓడించే అవకాశం ఉందన్నారు. రోహిత్ దత్తా ఈ ఏడాది ఫిబ్రవరి 24న యూరప్ నుండి ఢిల్లీకి వచ్చారు. జ్వరంతో ఆయన ఆసుపత్రికి వెళ్తే కరోనాగా తేలింది. దీంతో ఆయనను క్వారంటైన్ లో ఉంచారు. 

క్వారంటైన్ లో ఉన్న తనను వైద్య సిబ్బంది బాగా చూసుకొన్నారని ఆయన వివరించారు. తనను తాను శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నట్టుగా తెలిపారు.  
 

click me!