దారుణం : భర్త కళ్లముందే ‘ఐ లవ్ యు’ మెసేజ్ పెట్టి... టెర్రస్ బిల్డింగ్ మీదినుంచి దూకి భార్య ఆత్మహత్య.. !

Published : Sep 23, 2021, 11:07 AM IST
దారుణం : భర్త కళ్లముందే ‘ఐ లవ్ యు’ మెసేజ్ పెట్టి... టెర్రస్ బిల్డింగ్ మీదినుంచి దూకి భార్య ఆత్మహత్య.. !

సారాంశం

ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం, ముఖర్జీ నగర్‌లోని నిరంకారి కాలనీకి చెందిన నేహా వర్మ ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త ధరమ్ వర్మ అపార్ట్ మెంట్లోకి వస్తుండగా.. టెర్రస్ నుండి దూకింది. అది గమనించిన భర్త ధరమ్ వర్మ వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు.

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ అపార్ట్‌మెంట్ భవనం ఐదవ అంతస్తు నుండి దూకి 52 ఏళ్ల మహిళ మృతి (Suicide) చెందింది. ఈ దారుణ ఘటన మంగళవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం, ముఖర్జీ నగర్‌లోని నిరంకారి కాలనీకి చెందిన నేహా వర్మ ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త ధరమ్ వర్మ అపార్ట్ మెంట్లోకి వస్తుండగా.. టెర్రస్ నుండి దూకింది. అది గమనించిన భర్త ధరమ్ వర్మ వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు.

Modi US Visit:అమెరికాకు చేరుకొన్న మోడీ, ఎన్ఆర్ఐల స్వాగతం, బిజీ బిజీ

నేహా, ఆమె భర్త ఆ బిల్డింగులోనే చాలా కాలంగా ఉంటున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు. వీరిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట విడిపోవాలనుకుంటున్నారు. కొంతకాలంగా ఇద్దరిమధ్య ఇదే విషయం చర్చ జరుగుతోంది. 

అయితే బిల్డింగ్ మీదినుంచి దూకడానికి ముందు నేహా తన భర్తకు "ఐ లవ్ యు" అని మెసేజ్ పెట్టింది. నేహా బిల్డింగ్ మీదినుంచి దూకడం సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని, నేహా మొబైల్‌ని పరిశీలిస్తున్నారు.  యూఎస్ లో ఉంటున్న వీరి కుమారుడు, కుమార్తె ఢిల్లీకి చేరుకున్న తర్వాత పోస్టుమార్టం జరుగుతుంది.
 
PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !