గుడ్ న్యూస్ : వచ్చేనెలలో 44 కొత్త ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్...

By AN TeluguFirst Published Apr 27, 2021, 3:52 PM IST
Highlights

వచ్చే నెలలో ఢిల్లీలో 44 కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటవుతాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు.  వీటిలో ఎనిమిది కేంద్రం ఏర్పాటు చేస్తుండగా మిగిలిన ప్లాంట్ల ఏర్పాటు బాధ్యత ఢిల్లీ ప్రభుత్వమే తీసుకుంది.

ఆక్సిజన్ కొరతతో ఢిల్లీ అల్లాడిపోతూ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆక్సిజన్ ట్యాంకర్లు  కొరత కూడా తనను వేధిస్తోందని ఢిల్లీ సీఎం తెలిపారు. దీనికి పరిష్కారంగా బ్యాంకాక్ నుంచి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నామని కేజ్రీవాల్ తెలిపారు.

అలాగే వెంటనే ఉత్పత్తి ప్రారంభించే స్థితిలో ఉన్న మరో ఇరవై ఒక్క ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని కూడా ఆయన తెలిపారు. గతవారం తీవ్రస్థాయికి చేరుకున్న ఆక్సిజన్ కొరత ప్రస్తుతం కాస్త సద్దుమణిగిందని, పరిస్థితిని కొంతమేర చేపట్ట గలిగామని సీఎం పేర్కొన్నారు.

 కొత్త రోగులు ఆస్పత్రి లో చేర్చుకోవడం కూడా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రాణ వాయువు రవాణా వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్  తొలి రైలు 70 టన్నుల ఆక్సిజన్‌తో ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఈ 70 టన్నులను ఏయే ఆస్పత్రులకు కేటాయించాలనే దానిపై ఢిల్లీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది.

click me!