డాక్టర్ చెంప పగులగొట్టిన నర్స్.. వైరలవుతున్న గలీజు పని..

Published : Apr 27, 2021, 03:33 PM ISTUpdated : Apr 27, 2021, 06:57 PM IST
డాక్టర్ చెంప పగులగొట్టిన నర్స్.. వైరలవుతున్న గలీజు పని..

సారాంశం

లక్నోలోని ఓ ఆస్పత్రిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ నర్స్ ఏకంగా డాక్టర్ నే చాచి లెంపకాయ కొట్టింది. దీంతో ముందు షాక్ అయిన డాక్టర్ ఆతరువాత తానూ తిరిగి కొట్టాడు. ఇప్పుడీ విషయం వైరల్ గా మారింది. 

లక్నోలోని ఓ ఆస్పత్రిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ నర్స్ ఏకంగా డాక్టర్ నే చాచి లెంపకాయ కొట్టింది. దీంతో ముందు షాక్ అయిన డాక్టర్ ఆతరువాత తానూ తిరిగి కొట్టాడు. ఇప్పుడీ విషయం వైరల్ గా మారింది. 

మహమ్మారి కరోనా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఓ వైపు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, మరోవైపు ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు విడుస్తున్న విషాద ఘటనలు మానసికస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. 

అనేకమంది ఫ్రంట్లైన్‌ వారియర్లు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యులు కరోనా కల్లోల పరిస్థితుల్ని చూసి చాలా ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటేప్రస్తుత పరిస్థితుల్లో ఓ డాక్టర్, నర్స్ ఆస్పత్రిలో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం వైద్యుడి వద్దకు వచ్చిన నర్స్ ఏదో విషయమై ఆయనను నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అక్కడున్న పోలీసులు వారిని వారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో విచక్షణ కోల్పోయి నర్స్ డాక్టర్ పై చేయి చేసుకుంది.

దీంతో కంగుతిన్న డాక్టర్ వెంటనే స్పందించి ఆమెను తిరిగి కొట్టాడు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనపై నగర మేజిస్ట్రేట్ మాట్లాడుతూ ‘వాళ్ళిద్దరితోనూ మాట్లాడాను. తీవ్రమైన ఒత్తిడి, అధిక పని భారం వల్లే ఇలా చేసినట్లు..’ చెప్పారు ఏదేమైనా ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.

ఇక సోమవారం నాటి ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఓ పేషెంట్‌కు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశంపై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport