ఒక్కరి నుంచి 406మందికి కరోనా సోకే ప్రమాదం..!

Published : Apr 27, 2021, 03:35 PM IST
ఒక్కరి నుంచి 406మందికి కరోనా సోకే ప్రమాదం..!

సారాంశం

ఒక్కో కరోనా రోగి వల్ల 30 రోజుల్లో 406 మంది ఈ మహమ్మారి బారిన పడతారని కేంద్రం  హెచ్చరించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కరోనాను నిరోధించేందుకు అత్యవసరమని మరోసారి స్పష్టం చేసింది. 


దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ కరోనా ప్రభావం తగ్గాలంటే... సామాజిక దూరం పాటించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా.. సామాజిక దూరం నిబంధనను పాటించని పక్షంలో ఒక్కో కరోనా రోగి వల్ల 30 రోజుల్లో 406 మంది ఈ మహమ్మారి బారిన పడతారని కేంద్రం  హెచ్చరించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కరోనాను నిరోధించేందుకు అత్యవసరమని మరోసారి స్పష్టం చేసింది. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ పత్రికా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకూ కరోనాపై జరిగిన అధ్యయనాలన్నీ ఇదే సూచిస్తున్నాయని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటించడంతో వ్యాప్తి తీవ్రత తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తే..ఒక్కో రోగి వల్ల 30 రోజుల్లో కేవలం 15 మందికే కరోనా సోకే అవకాశం ఉన్నట్టు యూనివర్శిటీల అధ్యయనంలో వెల్లడైందని పేర్కొన్నారు. కరోనా చికిత్సపై దృష్టిపెడుతూనూ వ్యాధి వ్యాప్తి నియంత్రణ మార్గాలకు ప్రాధాన్యమివ్వాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం