ఢిల్లీలో షాకింగ్.. ముసుగు వేసుకుని వచ్చి.. మహిళ ఇంట్లోకి దూరి కాల్పులు...

By SumaBala Bukka  |  First Published Oct 28, 2023, 2:10 PM IST

శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముష్కరులు ముసుగులు ధరించి ఆమె నివాసంలోకి చొరబడి మహిళపై దాడికి పాల్పడ్డారు.


న్యూఢిల్లీ : ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలో 24 ఏళ్ల యువతిని ఆమె ఇంట్లోనే కాల్చి చంపారు. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
గమనించిన చుట్టుపక్కలవాళ్లు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముసుగులు ధరించిన కొంతమంది దుండగులు ఆమె నివాసంలోకి చొరబడి మహిళపై దాడికి పాల్పడ్డారు. ఆమెను 24 ఏళ్ల పూజా యాదవ్‌గా గుర్తించారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు దుండగులను వెంబడించారు. దాడి చేసిన వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై తప్పించుకోబోతుండగా స్థానికులు వారిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ దుండగలు కాలినడకన పారిపోయారు.

Latest Videos

పోలీసులు మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు, కానీ దానికి నంబర్ ప్లేట్ లేదు. ఇద్దరు దాడి చేసిన వారిని గుర్తించి ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేపట్టారు.

గురువారం ఢిల్లీలోని మెట్రో స్టేషన్ సమీపంలో 30 ఏళ్ల మహిళ శవమై కనిపించింది. హంతకులు రాయితో మహిళ ముఖాన్ని వికృతీకరించారని పోలీసులు తెలిపారు.

click me!