కర్ణాటకలో మా ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసింది - కాంగ్రెస్

By Asianet News  |  First Published Oct 28, 2023, 1:09 PM IST

తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గనిగ అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు, కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేస్తోందని చెప్పారు. కానీ తమ ఎమ్మెల్యేలు అలాంటి వాటికి లొంగిపోరని అన్నారు.


కర్ణాటక కాంగ్రెస్ బీజేపీపై సంచలన విమర్శలు చేసింది. తమ ప్రభుత్వం కూల్చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. పార్టీ మారితే అనేక తాయిలాలు ఇస్తామని తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిందని పేర్కొంది. అయినా తమ ఎమ్మెల్యేలు లొంగలేదని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మండ్య ఎమ్మెల్యే రవి కుమార్ గనిగ తీవ్ర ఆరోపణలు చేశారు.

1995లో కేసీఆర్ కు నేనే మంత్రి పదవి ఇప్పించా.. పాలేరులో పార్టీ శ్రేయస్సు కోసమే పోటీ చేశా - తుమ్మల నాగేశ్వరరావు

Latest Videos

2019లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన వారే.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి, రూ.50 కోట్ల చొప్పున నగదు ఇచ్చి ప్రస్తుత ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని రవికుమార్ గనిగ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు పార్టీ మారడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష నేతలు మంత్రి పదవులు ఆఫర్ చేశారని, దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని అన్నారు. త్వరలోనే మాండ్యలో ఈ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

తమ ఎమ్మెల్యేలను సంప్రదించిన వారు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రలోభాలకు గురి చేశారని రవి కుమార్ అన్నారు. తమకు తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తమ శాసనసభ్యులను ప్రలోభ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని చెప్పారు.

అత్యాచారాలు, దోపిడీల్లో ముస్లింలు నెంబర్ 1 - ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు

‘‘ వారు మా నలుగురు ఎమ్మెల్యేలను కలిశారు. మా వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యేలను సంప్రదించిన వారిలో మాజీ సీఎం యడ్యూరప్ప మాజీ పీఏ కూడా ఉన్నారు. మైసూరు ప్రాంతానికి చెందిన ఒకరు, బెళగావి ప్రాంతానికి చెందిన మరొకరు ఈ బృందంలో ఉన్నారు.’’ అని ఆరోపించారు. బెళగావి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సంప్రదించారని, ఈ లావాదేవీకి సంబంధించిన అన్ని లెక్కలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. మైసూరు, బెళగావి, అర్సికెరెలో ప్రతిపక్ష నేతలు కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆరోపించారు.

శంషాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. ఫుట్ వేర్ షాప్ కమ్ గోదామ్ లో చెలరేగిన మంటలు..

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు రవి కుమార్ గనిగ తెలిపారు. కానీ బీజేపీ ఎత్తుగడ విఫలం అవుతుందని అన్నారు. వాస్తవానికి బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని, కానీ వారిని తాము ఎలాంటి ప్రలోభాలకు గురి చేయలేదని తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు వారిని ఆకట్టుకుంటున్నాయని అన్నారు. 135 మంది ఎమ్మెల్యేలతో తమ ప్రభుత్వం ఉందని, తమకు ఇంకెవరి మద్దతు కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం తర్వాత డీకే శివకుమార్ సీఎం అవుతారని గనిగ తెలిపారు. 

click me!