దారుణం : క్లాస్ లో సరిగా కూర్చోమన్నందుకు.. రాడ్ తో టీచర్ తల పగలగొట్టిన స్టూడెంట్.. !

Published : Sep 20, 2021, 04:09 PM IST
దారుణం : క్లాస్ లో సరిగా కూర్చోమన్నందుకు.. రాడ్ తో టీచర్ తల పగలగొట్టిన స్టూడెంట్.. !

సారాంశం

సరిగా కూర్చోవాలని అన్నందుకు ఐరన్ రాడ్ తో టీచర్ మీద దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. కాకపోతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఢిల్లీ : తరగతి గదిలో విద్యార్థులు సరిగా కూర్చోకుండా అల్లరి చేస్తుంటే.. టీచర్లు సరిగా కూర్చోవాలని హెచ్చరిస్తారు. అయితే సాధారణంగా విద్యార్థులు టీచర్లు చెప్పడంతో సర్దుకుని కూర్చుంటారు. టీచర్ కు భయపడి వెంటనే సర్దుకుంటారు. 

అయితే ఓ విద్యార్థి దీనికి వ్యతిరేకంగా దారుణంగా వ్యవహరించాడు. చిన్నవయసులోనే హింసకు తెగబడ్డాడు. సరిగా కూర్చోవాలని అన్నందుకు ఐరన్ రాడ్ తో టీచర్ మీద దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. కాకపోతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ లో చదువుతున్న లతీఫ్ అనే విద్యార్థి ఇప్పటికే రెండుసార్లు పరీక్షల్లో ఫెయిలవ్వడంతో.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే కొనసాగుతున్నాడు. 

రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం: నలుగురు సజీవదహనం, 12 మందికి గాయాలు

అయితే, టీచర్ క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టైంలో ఇష్టం వచ్చినట్లు కూర్చున్నాడు. అది గమనించిన టీచర్ కోపానికి వచ్చాడు. అతన్ని సరిగా కూర్చోవాలని చెప్పాడు. అంతే లతీఫ్ ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. దగ్గర్లో ఉన్న ఐరస్ రాడ్ తో టీచర్ మీద దాడి చేశాడు. 

ముందు షాక్ అయిన టీచర్.. ఆ తరువాత స్థానిక పోలీస్ స్టేషన్ లో లతీఫ్ మీద ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో క్లాసులోని విద్యార్థులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. టీచర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్