రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం: నలుగురు సజీవదహనం, 12 మందికి గాయాలు

Published : Sep 20, 2021, 03:02 PM IST
రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం: నలుగురు సజీవదహనం, 12 మందికి గాయాలు

సారాంశం

రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

జైపూర్:  రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం నాడు తెల్లవారుజామున ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.రాష్ట్రంలోని శ్రీగంగానగర్‌ జిల్లాలో  బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి.ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అనుప్ఘడ్ బికనీర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మోహన్ ఘడ్ కు శ్రీగంగానగర్ నుండి ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సుతో పాటు ఆయిల్ ట్యాంకర్ కు మంటలు వ్యాపించాయి. మంటల నుండి 21 మంది ప్యాసింజర్లు బయటపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఘటన స్థలంలో నాలుగు కాలిన మృతదేహాను స్వాధీనం చేసుకొన్నట్టుగా అనుప్‌ఘట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామ్ సింగ్ చెప్పారు. శ్రీగంగానగర్ ప్రాంతం నుండి బస్సు బయలుదేరిన సమయంలో ఈ బస్సులో 25 మంది మంది ప్రయాణీకులున్నారు. ఈ ఘటనలో సుమారు 12 మంది తీవ్రంగా గాయపడినట్టుగా పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu
CPI-CPM Joint Press Conference: విజయ్ కు వామపక్షాల మద్దతుసీఎం కుర్చీ ఎక్కనున్న తలపతి| Asianet Telugu