గుజరాత్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ ఇంటి అడ్రస్ ను ఇచ్చారు. బియ్యం రవాణా ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అధికారులు గుర్తించారు.
విజయవాడ: గుజరాత్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది.బియ్యం రవాణా పేరుతో డ్రగ్స్ ను సరఫరా చేసినట్టుగా డీఆర్ఐ అధికారులు గుర్తించారు. విజయవాడలోని ఓ ఇంటి చిరునామా ఇచ్చి డ్రగ్స్ సరఫరా కోసం వినియోగించినట్టుగా గుర్తించారు.
ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. కాకినాడ పోర్టు ద్వారా భారీగా డ్రగ్స్ రవాణా అయినట్టుగా డీఆర్ఐ అధికారులు తేల్చారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఢిల్లీకి చెందిన కుల్ దీప్ సింగ్ కీలకపాత్ర పోషించారని అధికారులు చెబుతున్నారు.
undefined
విజయవాడలోని సత్యనారాయణపురంలోని ఓ ఇంటి అడ్రస్ ద్వారా ఆశి ట్రేడింగ్ బియ్యం రవాణా చేస్తున్నట్టుగా చెప్పి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జూన్ మాసంలోనే ఆశీ ట్రేడింగ్ కంపెనీకి 25 టన్నుల డ్రగ్ రవాణా అయిందని డీఆర్ఐ గుర్తించింది.రాజస్థాన్ వాసి జయదీప్ లాజిస్టిక్ ద్వారా కాకినాడ కు డ్రగ్స్ రవాణా అయిందని అధికారులు అనుమానిస్తున్నారు.
లారీ నెంబర్ ఆర్ జే 01 జీబీ 8328 ద్వారా డ్రగ్స్ సరఫరా అయిందని అధికారులు గుర్తించారు. తప్పుడు అడ్రస్ లతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని గుర్తించారు.బియ్యం, టాల్కం పౌడర్ పేరుతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. దేశంలోని పలు పోర్టుల్లో డ్రగ్స్ దిగుమతి చేశారని గుర్తించారు. కుల్‌దీప్ ని పట్టుకొనేందుకు డీఆర్ఐ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.ముంద్రా సీ పోర్టు ద్వారా డ్రగ్స్ రవాణా ఆఫ్ఘనిస్తాన్ నుండి దిగుమతి.దేశంలో పలు సీ పోర్టుల్లో డ్రగ్స్ దిగుమతి కుల్‌దీప్ ని పట్టుకొనేందుకు డీఆర్ఐ గాలింపు