దారుణం.. Supreme Court ఎదుట ఆత్మ‌హ‌త్యయ‌త్నం..

By Rajesh KFirst Published Jan 22, 2022, 11:15 AM IST
Highlights

Supreme Court: దేశ సర్వోన్నత న్యాయస్థానం దగ్గర  ఓ వ్యక్తి (50) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ వ్య‌క్తిని నోయిడాకు చెందిన రాజ్​భర్ గుప్తాగా పోలీసులు గుర్తించారు.
 

Supreme Court: దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వద్ద దారుణం జరిగింది. పేద‌రికంతో కొట్టుమిట్టాడుతోన్న వ్య‌క్తి..  తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. అందుకు సుప్రీంకోర్టే స‌రిన‌ని.. సర్వోన్నత న్యాయస్థానం వద్ద సజీవ దహనానికి యత్నించాడు. నోయిడాను చెందిన‌ 50 ఏళ్ల వ్యక్తి శుక్రవారం సుప్రీంకోర్టు వెలుపల నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. 

బాధితుడిని నోయిడా సెక్టార్ 128లోని ఫ్యాక్టరీలో  సెక్యూరిటీ గార్డ్​గా పనిచేస్తున్న రాజబాబు గుప్తాగా గుర్తించారు.  గత మూడు నెలలుగా జీతం రాలేదు. ఈ వేదనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితుడు కాలిన గాయాలతో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.  ఈ ఘటనతో అతనికి పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ లో చేర్పించారు.  

 గత ఆరు నెలల్లో సుప్రీంకోర్టు ఎదుట ఇలాంటి విచారకర ఘటన జరగడం ఇది రెండో సారి. గతేడాది ఆగస్టులో ఓ అత్యాచార బాధితురాలు (24) ఆత్మహత్యకు యత్నించింది.

click me!