ఓ ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు, ఉగ్రవాది అరెస్ట్

By Siva KodatiFirst Published Aug 22, 2020, 3:27 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు  భగ్నం చేశారు. పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టెర్రిరిస్టును అదుపులోకి తీసుకున్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు  భగ్నం చేశారు. పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టెర్రిరిస్టును అదుపులోకి తీసుకున్నారు. అతనిని ఐసిస్‌ గ్రూప్‌కు చెందిన అబు యూసుఫ్ ఖాన్‌గా గుర్తించారు.

అతని వద్ద నుంచి ఒక గన్ , రెండు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అబు యూసుఫ్‌ను పట్టుకునే క్రమంలో గత అర్ధరాత్రి దౌలా కువా, కరోల్ బాగ్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు.

దేశ రాజధానిలో ఓ ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు అబు నగరానికి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. మరోవైపు యూసుఫ్‌కు ఢిల్లీలోని కొందరు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నామని డిప్యూటీ కమీషనర్ ప్రమోద్ సింగ్ కుశ్వారా వెల్లడించారు.

అబు యూసుఫ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌గా తెలుస్తోంది. విచారణలో బాగంగా అతని స్వస్థలంలోనూ దాడులు చేపట్టినట్లు ప్రమోద్ సింగ్ పేర్కొన్నారు. ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఓ వైద్యుడిని రెండు రోజుల క్రితమే బెంగళూరులో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.

ఇతను యుద్ధంలో గాయపడిన ఐసిస్ ఉగ్రవాదులకు  వైద్య సాయం చేయడంతో పాటు ఓ మెడికల్ యాప్ రూపొందించి ఆయుధాల సమాచారానికి సంబంధించిన వివరాలను అందజేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 

click me!