భారత్ లో 30లక్షలకు చేరువలో కరోనా కేసులు

Published : Aug 22, 2020, 11:29 AM IST
భారత్ లో 30లక్షలకు చేరువలో కరోనా కేసులు

సారాంశం

ఇండియాలో కేవ‌లం 16రోజుల్లో 10ల‌క్ష‌ల కొత్త కేసులు రావ‌టం వైర‌స్ విస్తృతికి అద్దం ప‌డుతుంది. 10ల‌క్ష‌ల కొత్త కేసులు న‌మోద‌య్యేందుకు బ్రెజిల్ లో 23రోజులు, అమెరికాలో 28రోజులు ప‌ట్టింది. ఇండియ‌లో మొద‌టి 10ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యేందుకు 138రోజుల స‌మ‌యం తీసుకుంది.

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుందే కానీ.. తరగడం లేదు. అంతకంతకు ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 30ల‌క్ష‌ల‌కు చేరువ‌య్యింది. భార‌త్ క‌న్నా ముందు అమెరికా, బ్రెజిల్ మాత్ర‌మే ఉండ‌గా… ఇదేవిధంగా కొత్త కేసులు వ‌స్తే అతి త్వ‌ర‌లోనే బ్రెజిల్ కేసుల రికార్డును కూడా భార‌త్ దాట‌నుంది.

దేశంలో శుక్ర‌వారం రికార్డు స్థాయిలో 68వేల కొత్త కేసులొచ్చాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 29,71,112కు చేర‌గా, మ‌ర‌ణాల సంఖ్య 55,858కి పెరిగింది. గ‌త 24గంట‌ల్లో 958మంది మ‌ర‌ణించారు. ఇండియాలో కేవ‌లం 16రోజుల్లో 10ల‌క్ష‌ల కొత్త కేసులు రావ‌టం వైర‌స్ విస్తృతికి అద్దం ప‌డుతుంది. 10ల‌క్ష‌ల కొత్త కేసులు న‌మోద‌య్యేందుకు బ్రెజిల్ లో 23రోజులు, అమెరికాలో 28రోజులు ప‌ట్టింది. ఇండియ‌లో మొద‌టి 10ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యేందుకు 138రోజుల స‌మ‌యం తీసుకుంది.

శుక్రవారం బెంగాల్‌లో3,245కేసులు, గుజరాత్ లో1,204, మధ్యప్రదేశ్ 1,147, యూపీలో దాదాపు 5వేల కేసులు, ఢిల్లీ 1250, క‌ర్ణాట‌క 7571కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 14వేలకుపైగా కేసులు వ‌చ్చాయి. ఇక ప్ర‌తి రోజు అత్య‌ధిక టెస్టులు చేస్తున్న జాబితాలో గోవా, ఒడిశా మొద‌టి రెండు రాష్ట్రాల్లో నిలిచాయి. ఒడిశా మ‌హారాష్ట్రతో స‌మానంగా టెస్టులు చేస్తున్న‌ట్లు ఐసీఎంఆర్ గ‌ణంకాలు చెబుతున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?