లాక్‌డౌన్, కఠిన ఆంక్షల ఫలితం.. సేఫ్ జోన్‌లోకి ఢిల్లీ, అత్యల్ప కేసులు నమోదు

By Siva KodatiFirst Published May 21, 2021, 5:09 PM IST
Highlights

కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతం ఢిల్లీ. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక ఇక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రం ప్రభుత్వంతో తగవుకు దిగారు. అదే సమయంలో తాను చేయాల్సిన స్థాయిలో కోవిడ్‌ను కంట్రోల్ చేశారు. ఈ కృషి ఫలితంగా దేశ రాజధానిలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 

ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,009 కరోనా కేసులు నమోదవ్వగా.. 252 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.76 శాతంగా నమోదైంది. ఏప్రిల్ 4వ తేదీ తర్వాత 5 శాతంలోపు పాజిటివిటీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి.

Also Read:కేజ్రీవాల్ పెద్ద మనసు: 10 కిలోల బియ్యం, కరోనా మృతులకు 50 వేలు ఆర్ధిక సాయం

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 5 శాతం లోపు పాజిటివిటీ రేటు నమోదైతే ఆ ప్రాంతం సేఫ్ జోన్‌లో ఉన్నట్టే లెక్క. పాజిటివిటీ రేటు తక్కువగా ఉండడంతో లాక్‌డౌన్ ఎత్తివేయాలన్న ఒత్తిడి కూడా అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో కేసుల ఉద్ధృతి తగ్గడానికి లాక్‌డౌన్ బాగా సాయపడిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ఇక రోజువారీ కేసులు కూడా పడిపోవడం ఏప్రిల్ 1 తర్వాత ఇదే తొలిసారి. వరుసగా మూడో రోజు నగరంలో నాలుగు వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో క్రియాశీల కేసులు 35,683గా వుండగా... రికవరీ రేటు 95.85 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.62 శాతంగా ఉంది. కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 14,12,959 మంది కోవిడ్ బారినపడగా.. 22,831 మంది చనిపోయారు

click me!