దీదీ కోసం తృణమూల్ ఎమ్మెల్యే రాజీనామా... అక్కడి నుంచే మమత బరిలోకి..?

By Siva KodatiFirst Published May 21, 2021, 4:51 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు తృణమూత్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కషి చేసిన ఆమె నందిగ్రామ్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు.

బీజేపీ పక్కా వ్యూహంతో ఆమె స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం.. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మమత దీనిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఓ స్పష్టతనిచ్చారు.

Also Read:కేంద్రానికి మమత లేఖ: స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నిర్మలా సీతారామన్

మమతా బెనర్జీ కోసం తన పదవిని వదులుకునేందుకు భవానీపూర్ ఎమ్మెల్యే ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సోవన్‌ దేవ్‌ ఛటోపాధ్యాయ్‌ శుక్రవారం రాజీనామా చేసినట్టు సమాచారం. ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే భవానీపూర్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు మమతా బెనర్జీ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

మరోవైపు మమతా బెనర్జీ ఎక్కడ పోటీ చేసినా ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. మమతా పోటీ చేసే స్థానంపై బీజేపీ ప్రధాన దృష్టి పెట్టింది. అయితే భవానీపూర్‌ నుంచే మమత 2016లో గెలిచిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం టీఎంసీకి కంచుకోట కావడంతో మమత గెలుపు ఖాయమేనని వాదనలు వినిపిస్తున్నాయి. 

click me!