Delhi New Liquor Policy: ఢిల్లీలో మ‌ళ్లీ పాత లిక్క‌ర్ విధాన‌మే.. కొత్త విధానంపై ర‌గ‌డ‌..!   

By Rajesh KFirst Published Jul 30, 2022, 1:02 PM IST
Highlights

Delhi New Liquor Policy: దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ పాత లిక్క‌ర్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ది. ఆగ‌స్టు 1 నుండి మ‌ళ్లీ పాత విధానం అమ‌లు అవుతుంద‌ని డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా తెలిపారు. 

Delhi New Liquor Policy: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన నూత‌న‌ మద్యం పాలసీపై దుమారం రేగ‌డంతో మోకాలడ్డింది. దీంతో మ‌ళ్లీ పాత లిక్క‌ర్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ది. ఢిల్లీలో అమలవుతున్న కొత్త మద్యం పాలసీపై వివాదం చేల‌రేగ‌డంతో ఆప్ నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ..కేంద్రం ప్ర‌భుత్వంపై విరుచ‌క‌ప‌డ్డారు. గుజరాత్ తరహాలో ఇక్కడ కూడా క‌ల్తీ  మద్యాన్ని విక్రయించాలని బీజేపీ భావిస్తోందని మండిప‌డ్డారు. ఆగ‌స్టు 1 నుంచి పాత‌ విధానంలో అమ‌లు అవుతుంద‌ని సిసోడియా తెలిపారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో నాటు సారా విషాదాల‌ను సహించ‌బోమ‌ని, అందుకే నూత‌న‌ లిక్క‌ర్ విధానం బ‌దులుగా, మ‌ద్యాన్ని పాత ప‌ద్ధ‌తిలోనే అమ్మ‌నున్న‌ట్లు సిసోడియా తెలిపారు.

గుజరాత్‌లో బీజేపీ వాళ్లు ఇంట్లో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇదే నమూనాను ఢిల్లీలో కూడా అమలు చేయాల‌ని భావిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కొత్త మద్యం పాలసీలో ఎలాంటి కుంభకోణం జ‌రిగింద‌ని ప్ర‌శ్నించారు. ఇంతకు ముందు ఢిల్లీలో చాలా మద్యం షాపులు ప్రభుత్వానివేనని, చాలా అవినీతి జరిగిందని, వాటి నుంచి లైసెన్సు ఫీజులు కూడా తక్కువ తీసుకున్నారని, ఈ దుకాణాలను అంతం చేశామన్నారు. నూత‌న‌ పాలసీలో మునుపటిలా 850 షాపులు ఉన్నాయని, ఈడీ, సీబీఐతో ప్రైవేట్ షాపుల యజమానులను బెదిరించారని, ఆ తర్వాత చాలా మంది షాపు నుంచి వెళ్లిపోయారని బీజేపీపై మండిపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీలో 468 ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉన్నాయని తెలిపారు.

ఢిల్లీలో కల్తీ మద్యం విక్రయించాలని బీజేపీ భావిస్తోంది

ఇకపై ఢిల్లీలో పాత మద్యం విధానమే వర్తిస్తుందని సిసోడియా తెలిపారు. మద్యం కొరత కారణంగా కల్తీ మద్యం వ్యాపారం పెరిగి వారికే మేలు జరుగుతుందని అన్నారు. కల్తీ మద్యం వల్ల మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అన్నారు. కేవలం బీజేపీ వాళ్లు మాత్రమే మద్యం తయారీ, అమ్మకాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వానికి 6న్నర వేల కోట్ల ఆదాయం వచ్చేదని, అదే దుకాణాల ద్వారా 9 వేల కోట్ల ఆదాయం తీసుకుంటున్నామని అంటే ప్రభుత్వ ఆదాయం ఒకటిన్నర రెట్లు పెరిగిందని సిసోడియా చెప్పారు.

ఇకపై ప్రభుత్వ దుకాణాల నుంచే మద్యం విక్రయాలు  

ఢిల్లీలో మద్యం కొరత సృష్టించాలని బీజేపీ భావిస్తోందని, తద్వారా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించి లబ్ధి పొందుతారని సిసోడియా అన్నారు. గుజరాత్ లాగా ఢిల్లీలో కూడా నకిలీ మద్యం విక్రయించాలని డిప్పీ సీఎం అన్నారు. ఇప్పుడు కొత్త పాలసీని మూసివేసి, ప్రభుత్వ దుకాణాల ద్వారా లీగల్ లిక్కర్ అమ్మాలని నిర్ణయించుకున్నామని, ఇప్పుడు ఢిల్లీలో పాత మద్యం విధానాన్నే అమలు చేస్తామని చెప్పారు.

click me!