
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొత్త భయం మంకీపాక్స్ ఇప్పుడు ఆఫ్రికా వెలుపల తొలి మరణాన్ని నమోదు చేసింది. బ్రెజిల్‌లో 41 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ బారిన పడి మరణించారు. ఈ వ్యాధి బారిన పడి, ఆఫ్రికా బయట చనిపోయిన మొదటి వ్యక్తి ఆయనే. బాధితుడికి వ్యాధి సోకిన తరువాత రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆయన ఆగ్నేయ మినాస్ గెరైస్ రాష్ట్ర రాజధాని బెలో హారిజోంటేలో అతడు మరణించాడు.
బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 1,000 వరకు ఈ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జూన్ 10వ తేదీన మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. మొదటి సారిగా వ్యాధి సోకిన వ్యక్తి యూరప్ పర్యటన నుండి తిరిగి వచ్చాడు.
భార్యపై స్నేహితులతో కలిసి భర్త సామూహిక అత్యాచారం..కట్నం ఇవ్వలేదనే దారుణం..
కాగా.. స్పెయిన్ లో కూడా మంకీపాక్స్ వైరస్ సోకడం వల్ల ఒకరు మరణించారు. స్పానిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో ఈ వైరస్ వల్ల చనిపోయిన మొదటి కేసు ఇది. మంకీపాక్స్ సోకిన 120 మందిని ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేర్చారని, అందులో ఒకరు మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే అతడి మరణం గురించి మంత్రిత్వ శాఖ ఎక్కువ వివరాలను అందించలేదు. స్పెయిన్‌లో ఇప్పటివరకు 4,298 మంది వైరస్ బారిన పడ్డారని, వీరిలో 3,500 మంది పురుషులు ఇతర పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. ఇన్ఫెక్షన్ కేసుల్లో 64 మంది మాత్రమే మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.
1970లో కాంగోలో మంకీపాక్స్ ను తొలిసారిగా మనుషుల్లో గుర్తించారు. కానీ ఆ తర్వా త దాదాపు 50 సంవత్సరాల వరకు వైరల్ ఇన్ఫెక్షన్ అనారోగ్యం కొన్ని కేసులు ఆఫ్రికన్ ప్రాంతాల వెలుపల నుంచి స్థానికంగా నివేదించబడ్డాయి. అందుకే యూఎస్, యూకే, యూరప్, ఇండియాతో పాటు ఇతర ప్రాంతాలకు ఈ వ్యాధి అకస్మాత్తుగా వ్యాపించడం అందరినీ ఆశ్చర్యా నికి గురి చేసింది. కాగా ఈ వైరస్ వ్యాప్తిపై WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ గురువారం మాట్లాడారు. ప్రస్తుతం వ్యాప్తిని తగ్గించవచ్చని తెలిపారు. దేశాలు, సంఘాలు, వ్యక్తులు ఎవరికి వారు ఈ వైరస్ ను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. ‘‘ పురుషులతో సెక్స్ చేసే పురుషులు ప్రస్తుతానికి మీ లైంగిక భాగస్వా ముల సంఖ్యను తగ్గించుకోవాలి. కొత్త భాగస్వా ములతో సెక్స్ విషయంలో ఒక సారి పునఃపరిశీలించాలి. ’’ అని ఆయన చెప్పారు.
Teacher Recruitment Scam : వెక్కివెక్కి ఏడ్చిన అర్పితా ముఖర్జి.. ఆస్పత్రిలో హై డ్రామా...
ఇదిలా ఉండగా భారత్ లో కూడా ఇప్పటి వరకు 4 మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. జూలై 27వ తేదీన చివరి నాలుగో కేసు నమోదు అయ్యింది. ఇందులో మొదటి మూడు కేసులు కేరళలలో, చివరి నాలుగో కేసు ఢిల్లీలో వెలుగుచూసింది. ఈ వైరస్ వల్ల ఒక్క మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ అన్నారు. కాగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మే నెల నుంచి కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.