ఫిబ్రవరి 22న ఢిల్లీ మేయర్ ఎన్నికలు.. సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదనను ఆమోదించిన ఎల్జీ సక్సేనా

Published : Feb 18, 2023, 05:48 PM IST
ఫిబ్రవరి 22న ఢిల్లీ మేయర్ ఎన్నికలు.. సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదనను ఆమోదించిన ఎల్జీ సక్సేనా

సారాంశం

ఢిల్లీ మేయర్ ఎన్నికలు ఈ నెల 22వ తేదీన నిర్వహించాలని సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనలను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆమోదించారు. దీంతో అదే రోజు ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు.  

న్యూఢిల్లీ: ఈ నెల 22వ తేదీన ఢిల్లీ మేయర్ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదించారు. సివిక్ బాడీ హెడ్ ఆఫీసు ఎంసీడీ సదన్‌లో ఉదయం 11 గంటలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. తీర్పు వెలువడిన 24 గంటల్లోపు మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల పై తొలి సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో అపాయింటెడ్ సభ్యులు ఓటు వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఆప్ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి విజయం అని సుప్రీంకోర్టు తీర్పును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. 

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దూకుడు.. సిసోడియాకు మరోసారి సమన్లు.. రేపు విచారణకు రావాలని ఆదేశం..

మేయర్ ఎన్నికల్లో నామినేట్ చేసిన అభ్యర్థులు ఓటు వేయవచ్చునా? అనే అంశంపై ఆప్ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య వివాదం కొనసాగింది. తద్వార గడిచిన రెండ నెలల్లో మూడు సార్లకు పైగా ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. చివరకు ఈ వివాదానికి సుప్రీంకోర్టు తీర్పు ఫుల్‌స్టాప్ పెట్టింది.

ఈ నెల 22వ తేదీనే ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులనూ ఎన్నుకుంటారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?