ఢిల్లీ డెత్ మిస్టరీ: ఎంట్రెన్స్‌లో 11 పైపులు, 11 మంది డెడ్ బాడీలు కూడ అలానే...

First Published Jul 2, 2018, 3:45 PM IST
Highlights

ఆ 11 పైపుల మాదిరిగానే 11 డెడ్‌బాడీలు, ఏం జరిగింది?

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని బురారీ ఏరియాలో నివాసం ఉంటున్న భాటియా కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద మృతి కేసులో మరో ట్విస్ట్  చోటు చేసుకొంది.  ఇంటి ప్రవేశ ద్వారం వద్ద  11 గొట్లాలు అసాధారణపద్దతిలో అమర్చారు. మృతదేహాలు ఏ రకంగా వేలాడాయో అదే తరహలో పైపులు కూడ ఉన్నాయి. అయితే ఈ పైపులకు భాటియా కుటుంబసభ్యుల మరణాలకు సంబంధం ఉంటుందనే అనుమానాలు కూడ లేకపోలేదు 

న్యూఢిల్లీలోని బురారీ ఏరియాలో ఆదివారం నాడు ఉదయం భాటియా కుటుంబంలో 11 మంది అనుమానాస్పదస్థితిలో మరణించారు.మోక్షం కోసమే వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలు కూడ  విన్పిస్తున్నాయి.అయితే ఈ కేసును పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

బురారీ ఇంట్లో  ఓ లేఖ దొరికింది ఈ లేఖను పోలీసులు డీకోడింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద 11 గొట్టాలు అసాధారణ పద్దతిలో అమర్చారు. ఆ పైపులు  అమర్చిన తీరు, మృతదేహాలు వేలాడిన తీరు ఒకేలా  ఉన్నాయి. దీంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చనిపోయేముందు  చేతులు, కాళ్లు ఎలా కట్టుకోవాలనే అంశాన్ని కూడ లేకలో రాసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ లేఖను డీకోడింగ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. 
ఎలా చనిపోవాలనే విషయమై  ఈ లేఖలో చర్చించారు. కళ్లకు ఎలా గంతలు కట్టుకోవాలనే విషయమై కూడ రాసి ఉంది.

చనిపోవడానికి వారం రోజుల ముందు నిష్టగా పూజలు నిర్వహించాలని కూడ ఉంది. ఒకవేళ ఆత్మ ప్రవేశిస్తే మరుసటి రోజే పనిని పూర్తి చేయాలని కూడ రాశారు.  నోటికి కట్టిన బట్టను గట్టిగా కట్టుకోవాలని కూడ సూచించారు.

ఎవరు ఎంత కఠినంగా దీక్షను పూర్తి చేస్తే మోక్షం అంతే స్థాయిలో ఉంటుందని కూడ ఆ లేఖలో ఉంది. అయితే 11 మంది మృత్యువాత పడితే అందులో ఆరుగురు ఊపిరాడక మరణించారని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.


 

click me!