మాయమైన మానవత్వం.. బహిరంగంగా యువకుడిపై కత్తితో దాడి.. తన బిడ్డను రక్షించాలని ప్రాధేయపడ్డ తల్లి..

By Rajesh KarampooriFirst Published Jun 10, 2023, 12:48 AM IST
Highlights

ఈశాన్య ఢిల్లీలో  యువకుడిపై ఓ దుండగుడు బహిరంగంగా కత్తి దాడి చేయగా.. ఘటనా స్థలంలో ఉన్నవారు బాధితుడికి ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇదే సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 

దేశరాజధాని ఢిల్లీలో మరోసారి మానవత్వానికి తలవంపులు తెచ్చే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నంద్ నగ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్ నగ్రి ప్రాంతంలో ఓ యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో గాయపడి తన కొడుకును కాపాడాలంటూ ఓ తల్లి రోడ్డుపై అర్థనాథాలు చేసింది. ఈ ఘటన సమయంలో  చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. అయినా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ దారుణ ఘటన గురువారం (జూన్ 8) అర్థరాత్రి జరిగింది.

వివరాల్లోకెళ్తే.. నంద్ నగ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్ నగ్రి ప్రాంతంలో ఖాసీం అనే యువకుడిపై  షోయబ్ అనే దుండగుడు కత్తితో దాడి చేశాడు. దాడిలో  తన కొడుకును కాపాడాలంటూ ఓ తల్లి రోడ్డుపై అర్థనాథాలు చేసింది. ఈ ఘటన సమయంలో  చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. అయినా.. ఖాసీంం‌ను రక్షించడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ.. ఈ సంఘటన మొత్తాన్ని కొంతమంది తమ ఇంటి బాల్కనీ నుండి మొబైల్‌లో రికార్డ్ చేసి.. నెట్టింట్లో పోస్టు చేశారు. గాయపడిన ఖాసీం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు షోయబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షోయబ్, ఖాసీం మధ్య కొంతకాలం క్రితం గొడవ జరిగినట్లు విచారణలో తేలింది. గతంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి గురువారం రాత్రి  షోయబ్ ఖాసిమ్‌పై దాడి చేశాడు.

అసలేం జరిగిందంటే ?

ఈశాన్య జిల్లా అదనపు డీసీపీ సంధ్యా స్వామి మాట్లాడుతూ.. గురువారం అర్థరాత్రి ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపుతున్నట్టు పీసీఆర్ కాల్ వచ్చిందని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జీటీబీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. క్షతగాత్రుడిని ఖాసీం (22 సంవత్సరాలు)గా గుర్తించారు. షోయబ్ అనే యువకుడు ఖాసీంపై  కత్తి దాడి చేసినట్లు బాధితుడి బంధువులు పోలీసులకు తెలిపారు. ఈ దాడిలో ఖాసీం కాళ్ల నరాలు తెగిపోయాయి. చేతులపై కూడా తీవ్ర గాయాలయ్యాయి.

షోయబ్ అలియాస్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో షోయబ్, ఖాసీం మధ్య కొంత కాలం క్రితం ఏదో విషయమై గొడవ జరిగినట్లు తేలింది. దానికి ప్రతీకారంగా షోయబ్ ఖాసింం‌పై దాడి చేసినట్టు తేలింది.  ఢిల్లీలోని సుందర్‌ నగ్రి ప్రాంతంలో జరిగిన కత్తి దాడి ఘటనలో అక్కడి ప్రజలు ప్రేక్షకుడిగా ఎందుకు చూస్తూనే ఉంటారనే ప్రశ్నను మరోసారి లేవనెత్తింది. అటువంటి సంఘటన ఏదైనా జరిగితే, సహాయం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఢిల్లీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి వ్యక్తిని ఒంటరిగా వదిలిపెట్టవద్దని తెలిపారు.

click me!