
Murder in Delhi: దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఒక యువకుడిపై కొంత మంది వ్యక్తులు అత్యంత పాశవికంగా .. అమానుషంగా.. దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాలు.. ఢిల్లీలోని దబ్రీ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే యువకుడిపై కొంత మంది యువకులు అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డారు. అతడికి కిందపడేసి, బెల్ట్ లు, కర్రలతో అతి దారుణంగా చితకబాదరు. ఈ దారుణాన్ని వీడియో కూడా తీశారు.
అయితే, గతంలో హోలీ పండుగ సమయంలో సూరజ్ అనే యువకుడికి, కృష్ణా కు మధ్య గొడవ జరిగింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని.. కొందరు యువకులు ఏప్రిల్ 23 న దబ్రీ ప్రాంతంలో సూరజ్ తన మిత్రులతో కలిసి కృష్ణ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు.
తీవ్ర గాయపడ్డ కృష్ట.. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు కృష్ణను దీన్ దయాళ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత.. చికిత్స పొందుతూ.. మూడు రోజుల తర్వాత.. ఏప్రిల్ 26 న మృతి చెందాడు. అయితే.. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
కాగా, తాజాగా, వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది.