రైలులో వాష్‌రూమ్‌కి .. ఎంతకీ రాలేదని వెళ్లిచూస్తే, ఉరికి వేలాడుతూ కనిపించిన యువతి

Siva Kodati |  
Published : May 08, 2022, 10:04 PM IST
రైలులో వాష్‌రూమ్‌కి .. ఎంతకీ రాలేదని వెళ్లిచూస్తే, ఉరికి వేలాడుతూ కనిపించిన యువతి

సారాంశం

బాంద్రా నుంచి జమ్మూతావికి వెళ్తున్న స్వరాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు వాష్‌రూమ్‌లో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. బాత్‌రూమ్‌కి వెళ్లిన యువతి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణీకులు వెళ్లి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది. 

మహారాష్ట్రలో (Maharashtra)  దారుణం జరిగింది. ఏకంగా రైలు వాష్‌రూమ్‌లోనే (train wash room) యువతి ఆత్మహత్యకు (suicide) పాల్పడింది. స్వరాజ్‌ ఎక్స్‌ప్రెస్‌లో (Swaraj Express) ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాంద్రా (Bandra ) నుంచి జమ్ముతావికి (Jammu Tawi) ఆదివారం బయలుదేరిన స్వరాజ్ ఎక్స్‌ప్రెస్‌లో 20 ఏళ్ల యువతి ఎక్కింది. ఆ తర్వాత రైలు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కొద్ది సేపటి తర్వాత సదరు యువతి వాష్‌‌రూమ్‌కని వెళ్లింది. అయితే ఎంతసేపటికీ యువతి సీట్లో వచ్చి కూర్చోలేదు.

దీంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణీకులు వాష్‌ రూమ్‌ తలుపులు బద్దలుగొట్టిచూడగా.. యువతి మృతదేహం కనిపించింది. అనంతరం దీనిపై రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. యువతి వాష్‌ రూమ్‌కి వెళ్లి చాలా సేపటి వరకు సీట్లోకి రాలేదని, ఎస్‌ 4 కోచ్‌లోని తోటి ప్రయాణికులు తెలిపారు. వాష్‌‌రూమ్‌ వద్ద యువతిని పిలిచినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఆ తర్వాత టీసీ కొందరు ప్రయాణికులతో కలిసి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే లోపలి నుంచి గడియవేసి ఉండటంతో దానిని తెరువలేకపోయారు. దీంతో రైలును దహను రోడ్‌ రైల్వేస్టేషన్‌ (Dahanu Road railway station) వద్ద నిలిపివేశారు.

రైల్వే సిబ్బందికి అక్కడికి చేరుకొని.. డోర్‌ను తెరిచిచూడగా యువతి మెడకు గుడ్డ బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. మృతదేహాన్ని వాష్‌రూమ్ నుంచి బయటకి తీసి ఆత్మహత్య కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మృతురాలి వద్ద లభించిన ఆధారాల ఆధారంగా ఆమెను బిహార్‌కు చెందిన ఆర్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దహనులోని కాటేజ్‌ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే మరణానికి కారణం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు  వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం