Anand Mahindra: హ్యాట్సాఫ్.. ఇచ్చిన మాట‌ను నేర‌వేర్చిన‌ మహీంద్రా..! ఇడ్లీ అమ్మకు మ‌ద‌ర్స్ డే గిప్ట్..

Published : May 08, 2022, 11:01 PM ISTUpdated : May 08, 2022, 11:20 PM IST
Anand Mahindra:  హ్యాట్సాఫ్.. ఇచ్చిన మాట‌ను నేర‌వేర్చిన‌ మహీంద్రా..!  ఇడ్లీ అమ్మకు మ‌ద‌ర్స్ డే గిప్ట్..

సారాంశం

Anand Mahindra: తమిళనాడు ఇడ్లీ అమ్మకు కొత్త ఇల్లు కట్టించి.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. మదర్స్‌ డే సందర్భంగా ఆదివారం కొత్త ఇంటిని ఆ వృద్ధురాలికి బహుమతిగా ఇచ్చారు  

Anand Mahindra: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉంటూ..  ఆస‌క్తిక‌ర పోస్టింగ్ ల‌తో ఎంతో మంది ఫాలోయ‌ర్స్  సంపాదించుకున్నారు. అలాగే.. ఎంతో దాతృత్వ గుణం ఉన్న వ్యక్తిగా పేరొందారు. తాజాగా ఆయ‌న త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉదార స్వ‌భావంతో మరోసారి వార్తల్లోకెక్కింది. మదర్స్ డే రోజున.. కేవలం రూ.1కే ఇడ్లీ సాంబార్ అందించే.. ఇడ్లీ అమ్మ కి వ్యాపారవేత్త ఆనంద మహీంద్రా కొత్త ఇంటిని అందించారు. గ‌తంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. 
 
దీనికి సంబంధించిన ఒక వీడియోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అలాగే గ‌తంలో ( ఏప్రిల్ 2021లో) చేసిన ట్వీట్ ను కూడా పంచుకున్నారు. మదర్స్ డే రోజున ఇడ్లీ అమ్మకు కొత్త ఇంటిని కానుకగా అందించడానికి దాని నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసిన త‌న బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెకు, ఆమె పనికి మద్దతివ్వడం ఒక ప్రత్యేకత. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని అందులో పేర్కొన్నారు.

'ఇడ్లీ అమ్మ' ఎవరు?

తమిళనాడు పెరూ సమీపంలోని వడివేలంపాళయం గ్రామానికి చెందిన కమలతాల్ (85) అనే వృద్ధురాలు ఇడ్లీ అమ్మగా పాపురల్‌ అయ్యారు. ఆమె గ‌త 40 ఏళ్లుగా సాంబార్, చట్నీతో కూడిన ఇడ్లీలను కేవలం రూపాయికే  ఇస్తోంది. వలస కూలీలకు, తన ప్రాంతంలో పనిచేస్తున్న ఇతర వ్యక్తులకు కేవలం ఒక రూపాయికి ఇడ్లీలను విక్రయిస్తుంది  తెల్లవారుజాము నుంచే ఇడ్లీ తయారీ పనుల్లో నిమగ్నమవుతుంది. రోజువారీ కూలీలు, పేదలకు రూపాయికే అల్పాహారం అందిస్తున్నది.
  
'ఇడ్లీ అమ్మ'కి కొత్త ఇల్లు  

ఈ ట్వీట్‌కి సంబంధించిన మహీంద్రా-అమ్మల సంబంధం..ఆనంద్ మహీంద్రా 10 సెప్టెంబర్ 2019న 'ఇడ్లీ అమ్మ' వీడియోను షేర్ చేశారు. ఆ తర్వాత 'ఇడ్లీ అమ్మ' వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని, కట్టెల పొయ్యికి బదులు గ్యాస్‌ స్టవ్‌ ఇప్పిస్తానని చెప్పారు. మహీంద్రా బృందం 'ఇడ్లీ అమ్మ'ని కలవడానికి వచ్చినప్పుడు, వారు కొత్త ఇల్లు కావాలని కోరుకున్నారు. ఆయన ఇచ్చిన మాట మేర‌కు ఇడ్లీ అమ్మకు కొత్త ఇల్లు క‌ట్టి ఇచ్చారు.   

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !