తెలుగు ప్రయాణీకులపై ఆంక్షలు : ఢిల్లీకి వెళ్తే 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి

By narsimha lodeFirst Published May 7, 2021, 11:35 AM IST
Highlights

తెలుగు రాష్ట్రాల నుండి ఢిల్లీకి వెళ్లేవారికి కేజ్రీవాల్ సర్కార్ షాకిచ్చింది. ఈ రెండు రాష్ట్రాల నుండి వచ్చినవారికి 14 రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి చేసింది ఢిల్లీ సర్కార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా వైరస్  వేరియంట్ నివేదికలు బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ సర్కార్  ఈ నిర్ణయం తీసుకొంది. 

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుండి ఢిల్లీకి వెళ్లేవారికి కేజ్రీవాల్ సర్కార్ షాకిచ్చింది. ఈ రెండు రాష్ట్రాల నుండి వచ్చినవారికి 14 రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి చేసింది ఢిల్లీ సర్కార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా వైరస్  వేరియంట్ నివేదికలు బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ సర్కార్  ఈ నిర్ణయం తీసుకొంది. 

also read:ఢిల్లీలోకి ఆక్సిజన్‌కు కటకట.. అంబులెన్స్ విత్ ఆక్సిజన్‌గా మారిన ఆటోలు

ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ తాజా ఆదేశాల మేరకు విమానం, రైలు, బస్సు, కారు, ట్రక్కు లేదా ఏ పద్దతిలో ఢిల్లీకి వచ్చే ప్రయాణీకులంతా  14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని తేల్చి చెప్పింది.లేదా  రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్నట్టుగా ధృవీకరణ పత్రాన్ని అందించాలని కోరింది. అంతేకాదు ఢిల్లీకి చేరడానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా లేదనే నిర్ధారణ చేసే ధృవీకరణ పత్రం అనివార్యమని ఢిల్లీ తేల్చి చెప్పింది. 

తమ ఆదేశాలను పాటించకపోతే  డిజాస్టర్ చట్టంలోని 51 నుండి 60 సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకొంటామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది.  ఢిల్లీలో 91,859 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 11,43,980 కరోనా కేసులు రికార్డయ్యాయి. కరోనాతో ఇప్పటికే 18,063 మంది మరణించారు.
 

click me!