ఇండియాలో కరోనాది అదే జోరు: వరుసగా రెండో రోజూ 4 లక్షలు దాటిన కోవిడ్ కేసులు

Published : May 07, 2021, 09:42 AM ISTUpdated : May 07, 2021, 11:30 AM IST
ఇండియాలో కరోనాది అదే జోరు: వరుసగా  రెండో రోజూ 4 లక్షలు దాటిన కోవిడ్ కేసులు

సారాంశం

వరుసగా రెండోరోజు భారత్ లో  కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 4,14,030 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 3,919 మంది మరణించారు. 

న్యూఢిల్లీ:  వరుసగా రెండోరోజు భారత్ లో  కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 4,14,030 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 3,919 మంది మరణించారు. దేశంలో తాజాగా నమోదైన కరోనా కేసులతో 21,485,285కి చేరుకొన్నాయి. దేశంలో ఇంకా 3.65 మిలియన్ యాక్టివ్ కేసులున్నాయి.దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినా ఆశించిన ప్రయోజనం దక్కలేదు. మహారాష్ట్రలో కరోనా విజృంభజణ కొనసాగుతోంది. రాష్ట్రంలో 62,194 కేసులు నమోదు కాగా, 853 మంది మరణించారు. కర్ణాటకలో 49,058 కేసులు రికార్డయ్యాయి.

కరోనాతో 328 మంది మరణించారు. బెంగుళూరులోనే 23,106 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 161 మంది చనిపోయారు. కేరళలో 42,464 కేసులు నమోదయ్యాయి. 63 మంది కరోనాతో మృతి చెందారు. యూపీలో 26,780 కేసులు రికార్డుకాగా, కరోనాతో 353 మంది చనిపోయారు. తమిళనాడులో 24,898 కేసులు రికార్డు కాగా, డిల్లీలో 20 వేల కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !