
న్యూఢీల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు జ్యుడీషీయల్ రిమాండ్ ను ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.#సోమవారంనాడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను హాజరుపర్చారు ఈడీ అధికారులు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు జ్యుడీషీయల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మనీష్ సిసోడియా గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. తన భార్య అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు. అయితే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వవద్దని దర్యాప్తు సంస్థలు కోర్టుల్లో తమ వాదనలు విన్పించాయి. దీంతో బెయిల్ ను ఇవ్వలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే విషయమై ఈ ఏడాది మార్చి 9న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు
ఈ నెల 10వ తేదీన మనీష్ మనీష్ సిసోడియాపై సప్లిమెంటరీ చార్జీసీట్ ను కూడా కోర్టుకు ఈడీ సమర్పించనుంది. ఇవాళ్టి లోపుగా సప్లిమెంటరీ చార్జీసీట్ కు సంబంధించిన సాఫ్ట్ కాపీని దాఖలు చేయాలని కూడా కోర్టు ఈడీని ఆదేశించిన విషయం తెలిసిందే. మనీష్ సిసోడియాపై ఈడీ సుమారు రెండువేల పేజీలతో చార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.