
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డికి సోమవారంనాడు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.తన భార్యకు అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును అభ్యర్ధించారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో 2022 నవంబర్ 10వ తేదీన ఈడీ అధికారులు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపిస్తుంది. ఈ విషయమై కోర్టుకు సమర్పించిన చార్జీసీట్లలో పలు అంశాలను పేర్కొంది.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు
2022 లో పలుదఫాలు శరత్ చంద్రారెడ్డిని విచారించింది. అరెస్ట్ కు ముందు కూడా విచారణ కోసం ఈడీ అధికారులు ఆయనను ఢీల్లీకి పిలిపించారు. విచారణకు సహకరించడం లేదని పేర్కొంటూ ఈడీ అధికారులు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డికి 2023 జనవరి27న మధ్యంతర బెయిల్ ను ఇచ్చింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. శరత్ చంద్రారెడ్డి నానమ్మ మృతి చెందినందున ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరత్ చంద్రారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.