న్యూఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు 2020: ఆరో శాసనసభ రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్

By narsimha lodeFirst Published Feb 11, 2020, 2:47 PM IST
Highlights

న్యూఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ జైజాల్ మంగళవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. 7వ అసెంబ్లీ ఫలితాలు వస్తున్న తరుణంలో ఆరో అసెంబ్లీని లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేశారు. 

న్యూఢిల్లీ:న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ జైజాల్  6వ,  అసెంబ్లీని రద్దు చేశారు.  ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆప్  మరోసారి అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా పలితాలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో  ఆరో అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

Also read:న్యూఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు 2020: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఆప్ దూకుడు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  70 అసెంబ్లీ స్థానాల్లో  ఆప్ అభ్యర్ధులు 58 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  కొత్త అసెంబ్లీ కొలువు తీరేందుకు వీలుగా ఆరో అసెంబ్లీని రద్దు చేస్తూ మంగళవారం నాడు మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నిర్ణయం తీసుకొన్నారు.

ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు కోసం మ్యాజిక్ ఫిగర్ దాటి ఆ  పార్టీ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించినందున త్వరలోనే కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. 

click me!