ఢిల్లీ పీఠంపై మూడోసారి కేజ్రీవాల్.. అంతా వాలంటైన్స్ డే మాయే!

By telugu teamFirst Published Feb 11, 2020, 1:53 PM IST
Highlights

2013లో ఢిల్లీలో డిసెంబరు 4న అసెంబ్లీ ఎన్నికలు జరగగా, డిసెంబరు 8న ఫలితాలు వెలువడ్డాయి. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ 31, ‘ఆప్’ 28, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ‘ఆప్’ కాంగ్రెస్‌తో జతకట్టాల్సి వచ్చింది. దీంతో డిసెంబరు 28న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ప్రభంజనం సృష్టించింది. సామాన్యుడిగా పోరాటం మొదలుపెట్టి కేజ్రీవాల్ ప్రస్తుతం ఒక శక్తిగా తయారయ్యారు. వరసగా ఆయన మూడోసారి ఢిల్లీలో విజయ ఢంకా మోగించారు. ఈ రోజు విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో మొత్తం 70 నియోజకవర్గాల్లో 57 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. ఫిబ్రవరి 14వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

అయితే... అరవింద్ కేజ్రీవాల్ కి.. ఈ ఫిబ్రవరి 14వ తేదీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఆయనకు ఆ తేదీ బాగా కలిసివస్తోంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటే.. ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమౌతుంది.2013, 2015 సంవత్సరాల్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రేమికుల రోజుతో లింక్ ఏర్పడింది.

Also Read భార్య పుట్టిన రోజు కానుక: కేజ్రీవాల్ వెనక శక్తి ఆమెనే.....

2013లో ఢిల్లీలో డిసెంబరు 4న అసెంబ్లీ ఎన్నికలు జరగగా, డిసెంబరు 8న ఫలితాలు వెలువడ్డాయి. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ 31, ‘ఆప్’ 28, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ‘ఆప్’ కాంగ్రెస్‌తో జతకట్టాల్సి వచ్చింది. దీంతో డిసెంబరు 28న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

అయితే ఆ తరువాత ఆప్, కాంగ్రెస్ మధ్య విబేధాలు తలెత్తడంతో, సీఎం కేజ్రీవాల్‌కు బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ తెగేసి చెప్పింది. దీంతో కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయన ఫిబ్రవరి 14ను ఎన్నుకున్నారు. ప్రేమికుల రోజునే ఆయన రాజీనామా చేశారు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అప్పటివరకూ 49 రోజుల పాటు మాత్రమే పరిపాలన సాగించింది. తరువాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు.

ఇక 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయాని కొస్తే, ఫిబ్రవరి 7న ఎన్నికల జరగగా, 10న ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 14న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018లో ‘ఆప్‘ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, ఫిబ్రవరి 14న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘ద్వేషానికి ద్వేషమే సమాధానం కాదు. ద్వేషానికి కేవలం ప్రేమతోనే సమాధానం చెప్పగలమని’ అరవింద్ కేజ్రీవాల్ తన ప్రేమ సందేశాన్ని గతంలో వ్యక్తం చేశారు. 

ఇప్పుడు తాజాగా మళ్లీ ఆయన విజయం సాధించారు. ఈసారి కూడా ఫిబ్రవరి 14 తేదనే ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఆయన ఈ ఫిబ్రవరి నెల బాగా కలిసివస్తోంది. ఏది ఏమైనా ఆయనకు ఢిల్లీ ప్రజలు వరసగా మూడోసారి సీఎంగా అవకాశం ఇవ్వడం గొప్ప విషయమే. 

click me!