ఢిల్లీ దారుణం: కారు కింద యువతి ఇర్కుకుపోయిందని తెలిసి కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

By Sumanth KanukulaFirst Published Jan 9, 2023, 9:51 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేయగా.. వారు పోలీసులు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేయగా.. వారు పోలీసులు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. యువతి కారు కింద ఇరుక్కుపోయిందని తమకు తెలుసని వారు పోలీసుల విచారణలో అంగీకరించినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. భయంతో కారు ఆపలేదని పోలీసులకు చెప్పారు. అయితే కారు ఆపితే హత్య కేసులో చిక్కుకుంటామని భయపడ్డామని.. అందువల్ల యువతి శరీరం విడిపోయే వరకు డ్రైవ్ చేస్తూనే ఉన్నట్టుగా నిందితులు చెప్పినట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి.

అయితే నిందితులు తొలుతు కారు చక్రాల కింద ఒక మహిళ చిక్కుకున్నదని తమకు తెలియదని పోలీసులకు తెలిపారు. కారులో మ్యూజిక్ సౌండ్ కారణంగా కారు కింద మహిళ చిక్కుకున్న విషయం తెలియలేదని అబద్దం చెప్పారు. అయితే తాజా దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

ఇక, అంజలి సింగ్ డిసెంబర్ 31 సాయంత్రం న్యూ ఇయర్ ఈవ్ పార్టీకి హాజరయ్యేందుకు అమన్ విహార్‌లోని తన ఇంటి నుండి బయలుదేరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో అంజలి ఇంటికి ఆలస్యంగా వస్తానని కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. అయితే అంజలి సింగ్ తన ఫ్రెండ్‌తో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కారు ఢీకొట్టింది. ఆమె కాలు కారు ఫ్రంట్ యాక్సిల్‌లో ఇరుక్కుపోయి.. ఆమెను కారు ఈడ్చుకెళ్లగా ఆమె ఫ్రెండ్ మరో వైపు పడిపోయింది. ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకుంది. ఇక, అంజలీ సింగ్‌ను కొట్టిన కారు.. ఆమెను సుల్తాన్‌పురి నుంచి వాయువ్య ఢిల్లీలోని కంఝవాలా వరకు 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు.  తెల్లవారుజామున 4.40 గంటలకు అంజలీ సింగ్ మృతదేహం బట్టలు చింపేసి, చర్మం ఒలిచిన స్థితిలో కనిపించింది.

ఇదిలా ఉంటే.. అంజలి శవపరీక్ష నివేదికలో భయానక విషయాలు వెలుగు చూశాయి. ఆమె శరీరంపై బాహ్యంగా అనేక గాయాలు అయ్యాయని శవపరీక్ష వెల్లడించింది. నివేదిక ప్రకారం.. అంజలిని కారుతో పాటు ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల చర్మం ఒల్చినట్లు అయింది. పక్కటెముకలు బయటపడ్డాయి.  ఆమె ఊపిరితిత్తులు బయటకు వచ్చాయి. రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు.. పుర్రె ఛిద్రమైంది. మెదడులోని కొంత భాగం కనిపించలేదు.

ప్రమాదంలో అంజలి తల, వెన్నెముక, కింది అవయవాలపై గాయాలయ్యాయని నివేదిక వెల్లడించింది. ఆమె మరణానికి కారణం షాక్, రక్తస్రావం అని జాబితా చేయబడింది. తీవ్రమైన గాయాలు సమిష్టిగా ఆమె మరణానికి కారణమై ఉండవచ్చని నివేదిక పేర్కొంది. ఇక, శవపరీక్ష నివేదిక ప్రకారం.. అంజలికి లైంగిక వేధింపులకు గురైనట్టుగా తెలిపే ఎలాంటి గాయం కాలేదు.

click me!