ఇండియన్ నేవీ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లపై నిషేధం

By telugu teamFirst Published Dec 30, 2019, 10:49 AM IST
Highlights

నావికాదళ ప్రాంతాల్లో సోషల్ మీడియా వెబ్ సైట్లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లలో పోస్టులు పెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నావికాదళ కేంద్రాలు, నేవీ షిప్ లలోకి స్మార్ట్ ఫోన్లను తీసుకురాకుండా నిషేధం విధించారు

ఇండియన్ నేవీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. నేవీ అధికారులు హనీట్రాప్ కి చుక్కుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల యువతుల వలలో చిక్కి నేవీ రహస్యాలను పాకిస్తాన్ దేశానికి చేరవేస్తున్న ఏడుగురు నౌకాదళ సిబ్బందిని తాజాగా రాష్ట్ర నిఘావర్గాలు అరెస్టు చేశాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నావికాదళ ప్రాంతాల్లో సోషల్ మీడియా వెబ్ సైట్లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లలో పోస్టులు పెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నావికాదళ కేంద్రాలు, నేవీ షిప్ లలోకి స్మార్ట్ ఫోన్లను తీసుకురాకుండా నిషేధం విధించారు. 

ఇండియన్ నేవీలో పనిచేస్తున్న యువకులకు సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ అమ్మాయిలతో వలపు వల విసిరి నేవీ రసహ్యాలను తెలుసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏడుగురు నేవీ ఉద్యోగులతోపాటు ఓ హవాలా రాకెట్ ఆపరేటర్ ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.

పాక్ యువతుల ద్వార భారత నావికాదళం రహస్యాలను తెలుసుకునేందుకు సోషల్ మీడియా ద్వార వలపు వల విసిరారని తేలడంతో భారత నావికాదళం నావికాదళ ఉద్యోగులు సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లను వినియోగించరాదని భారత నేవీ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

click me!