ప్రైవేట్‌ పార్ట్స్‌పై గాయాలు లేకపోతే.. లైంగిక దాడి కాదనడం సరికాదు: ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Published : Aug 15, 2023, 09:21 PM IST
ప్రైవేట్‌ పార్ట్స్‌పై గాయాలు లేకపోతే.. లైంగిక దాడి కాదనడం సరికాదు: ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

సారాంశం

Delhi High Court: బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌పై గాయాలు లేనందున లైంగిక వేధింపులు జరగలేదని భావించడం సరికాదని, నాలుగున్నర ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి ట్రయల్ కోర్టు విధించిన 12 ఏళ్ల జైలు శిక్షను  సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.  

Delhi High Court: బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌పై గాయాలు లేనందున లైంగిక వేధింపులు జరగలేదని భావించడం సరికాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. నాలుగున్నర ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి ట్రయల్ కోర్టు  12 ఏళ్ల జైలు శిక్షను  విధించింది.ట్రయల్ తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.

ట్రయల్ కోర్టు విధించిన తీర్పు సబబేనని పేర్కొంటూ.. చిన్నారిని కిడ్నాప్ చేయడం, లైంగికంగా వేధించడం వంటి నేరాలకు ఆ వ్యక్తికి విధించిన శిక్షను జస్టిస్ అమిత్ బన్సల్ సమర్థించారు. నిందితుడి పిటిషన్‌ను కొట్టిపారేసింది. 

ఢిల్లీలో ఓ నాలుగున్నర ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో దోషిగా తేలి శిక్షపడిన వ్యక్తి .. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన దాఖాలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తాజా వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్‌కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్ష సబబేనని సమర్థించింది. కాగా, నిందితుడు 2017లో నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ కేసులో విచారణ పూర్తిచేసిన ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ.. 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది. నిందితుడు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేశారు. బాలిక ప్రైవేట్‌ పార్ట్స్‌పై ఎలాంటి గాయాలు లేవని, మెడికల్‌ రిపోర్టులలో తేలిందని పేర్కొన్నారు.

తనకు కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని పిటిషనర్‌ కోరాడు. కానీ, ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌ రద్దు చేసింది. బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌పై గాయాలు లేనంత మాత్రాన లైంగిక దాడి జరగలేదని భావించలేమని వ్యాఖ్యానించింది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..